సక్సెస్ దిశగా ఆపరేషన్ సేతు 2…

కరోనా సెకండ్‌ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్‌ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్‌, 4,300 ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి జరుగుతోంది. దీని కోసం అక్సిజన్‌ సముద్ర సేతు-2 అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం.కరోనా వేళ విదేశాల నుంచి భారత్‌కు ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు మొత్తం 8,900 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు 5,043 ఆక్సిజన్‌ సిలిండర్లు సాయంగా అందాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి జరుగుతోంది. దీని కోసం అక్సిజన్‌ సముద్ర సేతు-2 అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం.

media handler 1

ఈ నెల 5 న సింగపూర్ లో బయలుదేరిన యుద్దనౌక ఐ ఎన్ ఎస్ ఐరావత్ ఇవాళ విశాఖ తీరం చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు- 2 లో భాగంగా కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న 9 నౌకలలో ఐ ఎన్ ఎస్ ఐరావత్ ఒకటి. ఆపరేషన్ సముద్ర సేతు-II లో భాగంగా గల్ఫ్, ఆగ్నేయ ఆసియా లోని ఫ్రెండ్లీ దేశాలనుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు వైద్యపరికరాలను ఐరావత్ తీసుకొచ్చింది. కోవిడ్‌-19 చికిత్సలో ఎదురవుతున్న ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సింగపూర్‌, యూఏఈల నుంచి అత్యధిక సామర్థ్యం గల ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది. ఆయా దేశాలతో జరిపిన చర్చలు ఫలించడంతో క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు మన దేశానికి చేరుకుంటున్నాయి.