మహిళపై పిడుగుద్దులతో రెచ్చిపోయాడు ర్యాపిడో బైక్ రైడర్. బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది
రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నావ్.. సిగ్నల్ జంప్ ఎందుకు చేస్తున్నావ్.. అని ఆ అమ్మాయి అడగటమే తప్పయిపోయింది. మహిళపై పిడుగుద్దులతో రెచ్చిపోయాడు ర్యాపిడో బైక్ రైడర్. బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న జయనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో ఓ అమ్మాయికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే సదరు ర్యాపిడో డ్రైవర్.. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేశాడు. దీంతో ఎందుకు అలా చేస్తున్నావ్.. అని ఆ అమ్మాయి అతడిని ప్రశ్నించడంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదాం జరిగింది. ఈ తరుణంలోనే ర్యాపిడో బైక్ రైడర్ సదరు అమ్మాయిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన పై బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.