మనదేశంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఉంది. వారు పండించిన పంట దేశానికి అందిస్తున్న రైతన్న.. ఆరుగాలం కష్టపడుతూనే ఉన్నాడు. దుక్కి దున్ని, విత్తనాలు నాటినప్పటి నుండి రైతుకు కష్టకాలమే. వానలు సరైన సమయానికి పడక ఇబ్బందులు పడుతారు.
మనదేశంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఉంది. వారు పండించిన పంట దేశానికి అందిస్తున్న రైతన్న.. ఆరుగాలం కష్టపడుతూనే ఉన్నాడు. దుక్కి దున్ని, విత్తనాలు నాటినప్పటి నుండి రైతుకు కష్టకాలమే. వానలు సరైన సమయానికి పడక ఇబ్బందులు పడుతారు. ఒకవేళ వర్షాలు పడినా భారీ వర్షాలతో పంట చేతికి రాక బాధపడుతుంటారు. అకాల వర్షాలతో రైతులు చాలా బాధపడుతుంటారు. ప్రకృతి బీభత్సానికి కూడా రైతులు బలవుతున్నారు. ఇలా అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే తాజాగా ఓ రైతు వినూత్న ప్రయాగానికి శ్రీకారం చుట్టాడు. కరెంట్ లేకుండానే పొలానికి నీళ్లు పెడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రైతు ఐడియాను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఓ రైతు తన పొలానికి నీళ్లు పెట్టేందుకు కరెంట్‌తో పనిలేకుండా పనిచేసే మోటార్‌ను తయారు చేశాడు. దీని కోసం బోరు మోటారు ఎదురుగా ఓ స్టాండు వేసి దానిపై మోటారు, ఓ చక్రాన్ని అమర్చాడు. ముందుగా కొద్దిసేపు చేత్తో చక్రాన్ని తిప్పడం వల్ల బోరు పైపు ద్వారా నీళ్లు బయటికి వచ్చాయి. వచ్చిన నీళ్లు ఎదురుగా ఉన్న చక్రంపై పడతాయి. దీంతో చక్రం వేగంగా తిరుగుతుంది. దీనితో విద్యుత్ ఉత్పత్తి అయి.. అటు మోటారు తిరుగుతూ, పొలానికి నీరు కూడా వెళుతుంది. పక్కనే బోర్డుకు బల్బులు కూడా అమర్చాడు. ఆన్ చేయగానే బల్బులన్నీ వెలుగుతూ ఉంటాయి. ఇలా ఫ్రీగా కరెంట్ ఉత్పత్తి చేసి పొలానికి నీళ్లు పెడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. రైతు తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అతన్ని పట్టాలేని పట్టభద్రుడని ప్రశంసిస్తున్నారు. రైతు ఐడియా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్స్‌ని తెలియజేయండి.