టీమిండియాకు బాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పటి వరకు ఎందరో క్రికెట్ స్టార్స్.. బాలీవుడ్ భామాలతో ప్రేమాయణాలు నడిపారు. అయితే ఓ హీరోయిన్‌ను పడేసేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
తన హ్యాండ్సమ్ లుక్స్‌తో బాలీవుడ్ హీరోలను తలపించే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి విశ్వవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ తొలి నాళ్ల నుంచే విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నించే విరాట్.. మైదానంలో పరుగులు చేయడంపై ఎంత శ్రద్ధ పెడతాడో.. బయట తన ౖస్టెల్‌పై కూడా అంతే దృష్టి సారిస్తాడు. ఎప్పటికప్పుడు హెయిర్ ౖస్టెల్స్, లుక్స్ మారుస్తూ సరికొత్తగా దర్శనమిస్తుంటాడు. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో కోహ్లీ ఫ్లర్ట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతోనే ఇదంతా చెప్పాల్సి వస్తోంది.
అందేంటీ ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మతో కోహ్లీ వివాహమైంది కదా అనకుంటున్నారా!విరాట్, అనుష్క జోడీ 2017లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో ప్రేమగా ఉండే ఈ జంటకు ‘వామిక’ సంతానం. మరి అలాంటిది కోహ్లీ మరో అమ్మాయితో ఫ్లర్ట్ చేయడం ఏంటి అనేగా మీ సందేహం. అందులోనూ నిజం లేకపోలేదు. అయితే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వీడియో మాత్రం పదేళ్ల కిందటిది! అప్పట్లో ఓ యాడ్‌లో తమన్నా భాటియాతో కలిసి విరాట్ నటించాడు. సెల్ కాన్ మొబైల్స్ ప్రమోషన్ కోసం చిత్రీకరించిన ఆ యాడ్‌లో కోహ్లీ తన హావభావాలతో కట్టిపడేశాడు.
తెలియని అమ్మాయిని లైన్లో పెట్టే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ యాడ్‌లో తమన్నా ఫోన్ నంబర్ కనుక్కునేందుకు విరాట్ వేసిన ఎత్తుగడలు అప్పట్లో యూత్‌ను తెగ్గ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ వీడియో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి రావడంతో.. పలువురు అభిమానులు ‘ఏంటి కోహ్లీ అన్నా ఇది’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి భాబీ (అనుష్క శర్మ)కు పంపాలా అని ప్రేమగా వారిస్తున్నారు.గతంలో పలువురు ప్రముఖ క్రికెటర్లు.. హీరోయిన్లతో ప్రేమాయణాలున నడిపిన విషయం తెలిసిందే.
దీంతో కెరీర్ ఆరంభ రోజుల్లో విరాట్‌పై కూడా చాలా రూమర్స్ వచ్చేవి. అందులో భాగంగా దశాబ్ద కాలం క్రితం విరాట్, తమన్నా మధ్య కూడా ఏదో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశంపై ఇద్దరూ ఏనాడు పెదవి విప్పలేదు. కేవలం ఈ యాడ్ సందర్భంలో మాత్రమే కలిసి కనిపించిన వీరి మధ్య అంతకుమించిన స్నేహం లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత ఓ సందర్భంలో తమన్నా మాట్లాడుతూ.. విరాట్ చాలా మంచి వ్యక్తి అని.. చాలా మంది యాక్టర్ల కన్నా అతడి స్కిల్స్ బాగుంటాయని పోగడ్తల్లో ముంచెత్తింది.
తాజాగా అభిమానులు కూడా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక కోహ్లీ సినిమాల్లోకి వస్తే సూపర్ డూపర్ హిట్ అవుతాడని వ్యాఖ్యానిస్తున్నారు.ఇటీవలె వెస్టిండీస్ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే జరుగనున్న ఆసియా కప్‌లో కోహ్లీ పాల్గొననున్నాడు. మరోవైపు తమన్నా లస్ట్ సిరీస్-2 వెబ్‌సిరీస్ మంచి హిట్ ఖాతాలో వేసుకుంది. దీంట్లో యాక్టర్ విజయ్‌తో కలిసి నటించిన తమన్నా.. అతడితో డేటింగ్‌లో ఉన్నాననే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.