విశ్వం, భూమి, ప్రకృతి, నదులు, సముద్రాలు ఇలా మన చుట్టూ ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు దాగున్నాయి. వాటిలో మనకు చాలా తెలుసు అనుకున్నా కూడా చాలా విషయాలు మనకు తెలియనివే ఉన్నాయి. ఈ భూమిమీద 70శాతం వరకు సముద్రాలే ఉన్నాయని మనకు తెలుసు. ఆ సముద్రాల్లో ఎంతో నీరు ఉందనీ తెలుసు. ఆ సముద్రాలపై ఆధారపడి కోట్ల మంది మనుషులు, కొన్ని కోట్ల జీవరాశులు బతుకున్న విషయం కూడా తెలుసు. ఇవన్నీ మీకు తెలుసుగానీ, అసలు […]
వివిధ నేరాలు చేసిన కేసుల్లో ఉన్న అనుమానితులను, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే అనుమానితులు, నిందితుల యోగక్షేమాలు చూసే బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు నిందితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అటువంటప్పుడు నిందితుల తిండి ఖర్చులు పోలీసులే పెట్టుకోవాల్సి వస్తుందని మీకు తెలుసా? అదేంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం పెట్టుకోవాలి గానీ.. పోలీసులు పెట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మరదే లాజిక్ తో కూడిన మ్యాజిక్కు. […]
హిందూ సనాతన సంప్రదాయాలలో ఆచరించే ప్రతీ అలవాటుకు ఓ కారణం ఉంటుంది. అలాగే వాటికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. కొన్ని అలవాట్లలో సైంటిఫిక్ రీజన్ లేనప్పటికీ భారతదేశంలో తరాలవారిగా ఆ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే చాలా మందికి కొన్ని కొన్ని విషయాల గురించి తెలియవు. అలాంటి తెలియని విషయాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే? గోరింటాకు పెడితే చేతులు ఎరుపెక్కుతాయని మనందరికి తెలిసిందే. అయితే అలా ఎర్రగా పండటానికి కారణాలు మాత్రం చాలా […]
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మ్యాప్ అనేది ఉంటుంది. మ్యాప్ ద్వారా ప్రాంతాలను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అయితే మీరు ఈ విషయాన్ని గమనించారా? భారత్ మ్యాప్ లో సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్ లు సగం మాత్రమే ఉంటాయి. కానీ శ్రీలంక మాత్రం పూర్తిగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో అని మీరెప్పుడైనా ఆలోచించారా? స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇండియా మ్యాప్ తో పాటు కింద శ్రీలంకను కూడా గీయించేవారు. ఇండియా మ్యాప్ అంటే శ్రీలంక […]
భారతదేశంలో ఉన్న ప్రతీ ఆచారం వెనుక శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ప్రతీ ఆచారంలోనూ శాస్త్రీయంగా మనిషికి మేలు చేసే ప్రయోజనాలు ఉంటాయి. భారతీయ సంస్కృతిలో పూలు అనేవి ఒక భాగం. ఆలయానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసినా, పండుగలప్పుడు గుమ్మాలకు, శుభకార్యాలకు, అలంకారం కోసం, మనిషి చనిపోతే దేహం మీద చల్లడం కోసం ఇలా అనేక రకాలుగా పుష్పాలను వాడడం అనేది జీవన విధానంలో ఒక భాగంగా వస్తున్న ఆచారం. పూలు మనిషికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సానుకూల […]
ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో కొంతమంది మద్యం బాబులు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటివి చేసి వార్తల్లో నిలిచారు. ఇన్ని అనర్థాలకు కారణమైనప్పుడు మద్యాన్ని ఎందుకు నిషేధించడం లేదూ అని మీకు అనిపించిందా? మద్యం వల్ల విమాన ప్రయాణాల్లో ఇన్ని గొడవలు అవుతున్నా కూడా అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు మద్యాన్ని సరఫరా […]
మగాళ్లు ఆడవాళ్ళకి ప్రపోజ్ చేసినప్పుడు.. నా హృదయం చాలా విశాలమైనదని.. అందులో 10, 15 ఫ్లాట్లు కట్టి.. రెంట్లు ఇవ్వొచ్చని.. ఆ రెంట్ డబ్బులతో జీవితాంతం బతకొచ్చునని చెబుతుంటారు. నా గుండెలో నీకోసం గుడి కట్టానని.. ఆ గుండెలో దేవతవి నువ్వని కవితలు చెప్తుంటారు. అమ్మాయిలు నో చెప్తే మాత్రం.. ఛీ నీకు మనసు లేదు, అందులో చోటు లేదు, ఆడవారి గుండె ఇరుకు, గరుకు అంటూ అబ్బాయిలు తిట్టేసి వెళ్ళిపోతారు. ఏ ఫ్రెండ్ కో జరిగింది […]
కూతురు, కోడలు.. కూతురు కోడలికి అంటే సోదరుడి భార్యకు అర్థ భర్త అని అంటారు. కాబట్టి ఆ కూతురు కూడా కోడలిని శాసించేలా ప్రవర్తిస్తుంటుంది. ఇది అందరి ఇండ్లలో ఉండవు. ఎక్కడో కొన్ని చోట్ల ఉంటుంది. కూతురు, కోడలు అనే ఈ ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటివారు. ఎదురుపడితే పాము, ముంగీసల్లా ఉంటారు. కొంతమంది మాత్రం అక్కా, చెల్లెళ్లలా కలిసి మెలిసి ఉంటారు. వాళ్ళ విషయం పక్కన పెడితే.. అత్తగారికి తన కోడలు ప్రధానమా? కూతురు ప్రధానమా? […]
రోడ్డు మీద నడుస్తున్నాం.. మన కళ్లేదురుగా ఏదో ప్రమాదం జరిగింది.. యాక్సిడెంట్ అయ్యింది.. రక్తపు మడుగులో పడి ఉన్నారు.. రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంది.. ఒకరినొకరు కొట్టుకున్నారు.. గాయపడ్డారు.. ఇలాంటి సీన్లు చూడగానే.. అందరికి వెంటనే గుర్తుకువ వచ్చేది.. 108. ఈ నంబర్‌కు డయల్ చేస్తే.. చాలు.. కుయ్‌కుయ్ మంటూ వచ్చి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. వారి ప్రాణాలు కాపాడుతుంది. అంబులెన్స్ సర్వీస్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాలు వంటి సంఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగేది […]
మతిమరుపు చాలా మందిని వేధించే ఒక సమస్య. నిత్యం చాలా మంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మతిమరుపు సమస్యను ఎదుర్కుంటారు. ఇంట్లో భార్య భర్తకు ఏదో తీసుకురమ్మని చెప్తే.. మర్చిపోవడమో, ఆఫీస్ లో బాస్ పని చెప్తే మర్చిపోవడమో ఇలా పలు సందర్భాల్లో మతిమరుపుని ఫేస్ చేస్తుంటారు. చిన్న చిన్న వాటిలో ఎక్కువగా మతిమరుపు అనేది ఉంటుంది. ఎవరో ఒకరు గుర్తు చేస్తేనే గానీ గుర్తు రాని పరిస్థితి. ఈ మతిమరుపు ప్రేమలో […]