ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్థానిక సంస్థల ఎన్నికల నగారా […]
AP DSC 2026 : ఏపీలోని నిరుద్యోగ యువతకు, ఏళ్లనుంచి టీచర్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ-2026 ప్రకటన విడుదలకావడంతో అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మంగళవారం విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఉన్న వేలాది ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరు ప్రకటనలను జారీ చేసింది. ఈ డీఎస్సీ-2026 నోటిఫికేషన్ […]
ఏపీ పాలిటిక్స్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా ఆయన ఒక కీలక అప్డేట్తో ముందుకు వచ్చారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని, ఒత్తిళ్లకు తలొగ్గి వెనకడుగు వేశానని, తనను ఎవరో బెదిరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పార్టీ పెట్టకూడదని కోరుకునే ప్రత్యర్థులే ఇలాంటి చౌకబారు ప్రచారాలు చేస్తున్నారని, వాటికి ఎలాంటి విలువా లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే తన కొత్త […]
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ రావడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంతో గొప్ప విషయమని, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని శాఖ సాధించిన ఈ విజయం అభినందనీయమని తెలిపారు. గత పాలకుల కంటే ఇప్పుడు ఏపీ అన్ని రంగాల్లో స్పష్టమైన పురోగతి సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.గతంలో ఏపీ అనగానే రోడ్ల దుస్థితి గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో రోడ్లన్నీ […]
ఆంధ్రప్రదేశ్‌లో భారీ టెక్స్టైల్, అప్పారెల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేరళకు చెందిన ప్రముఖ కిటెక్స్ గార్మెంట్స్‌ను రాష్ట్రంలో సుమారు 2,000 ఎకరాల్లో భారీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ విషయాన్ని కిటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం. జాకబ్ వెల్లడించారు. కిటెక్స్ గార్మెంట్స్ సంస్థ కేరళలోని కిజక్కంబలంలో నిర్వహిస్తున్న యూనిట్‌ను మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రతిపాదిత టెక్స్టైల్ పార్క్‌పై […]
తమిళనాడు సీఎం విజయ్ ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 13న ఆయన విజయవాడకు రానున్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఆయన ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఈ చర్చల్లో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల సరఫరాలో ఏర్పడిన లోటు, ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డ్యామ్‌లు, నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో […]
కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ‘ఇండియా బ్లాక్’ పార్టీల పిలుపు మేరకు ఇవాళ తలపెట్టిన ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి బయలుదేరిన ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవారంలోని ఆమె నివాసంలో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడ శివారులోని గన్నవరం కేసరపల్లిలో ఉన్న వైఎస్ షర్మిల నివాసం చుట్టూ ఇప్పుడు పోలీసులు భారీగా మోహరించారు. ఎటు చూసినా ఖాకీల బందోబస్తుతో ఆ […]
ఏపీలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడానికి ఉన్న అన్ని లీగల్ అడ్డంకులు తొలగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? వైసీపీ వాదనలేంటి? న్యాయస్థానం ఇచ్చిన కీలక స్పష్టత ఏంటి? ఇప్పుడు చూద్దాం. […]
బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని ఎంతో సాధారణంగా ఇంట్లో నుంచి స్కూటీపై బయటకు వెళ్లిన ఆ యువతి… తెల్లారేసరికి చెరువు గట్టున విగతజీవిగా తేలడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. నవ్వుతూ వెళ్లిన కూతురు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. ఒంటిపై తీవ్ర రక్తగాయాలు, విరిగిన చేయి… ఇవన్నీ చూస్తుంటే ఇదొక సాధారణ మరణం కాదని, ముమ్మాటికీ ఒక దారుణమైన హత్యని అందరూ అనుమానిస్తున్నారు. అసలు ఆ రోజు ఆయేషా మీరాకు ఏం జరిగింది… […]
బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, చట్టపరంగా రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేసింది.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల […]
