ఆసియా కప్ 2025కు ప్రకటించిన టీమ్ ఇండియా జట్టుపై వివాదం రేగుతోంది. సమర్ధులకు చోటు దక్కకపోవడం ఓ కారణమైతే..15మందినే ఎంపిక చేయడం మరో కారణం. ఇది సెలెక్షన్ కమిటీ నిర్ణయమా లేక బీసీసీఐ నుంచి ఆదేశాలొచ్చాయా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. జాతీయ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. మరి కొద్దిరోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15మందితో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించింది. […]
మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. బీసీసీఐ అధికారికంగా టీ20 టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో అనూహ్యంగా శుభమన్ గిల్ చోటు దక్కించుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ బాధ్యతలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గిల్ ఎంపిక వెనుక ఎవరి హస్తముందనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ సహా 8 […]
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా ఏడాది తరువాత టీ20 జట్టులో చేరిన శుభమన్ గిల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరి ఆ నలుగురు క్రికెటర్ల పరిస్థితి ఏంటి, రిటైర్ అయినట్టేనా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టీ20కు దూరం కాగా […]
మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. 15 మందితో కూడిన టీమ్ ఇండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా జట్టులో ఎవరెవరికి స్థానం లభించింది. ఎవరు అవుట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టీ20 ఫార్మట్‌లో జరిగే ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు అనౌన్స్ అయింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఛీఫ్ సెలెక్టెర్ అజిత్ అగార్కర్ జట్టుని ప్రకటించారు. టీ20 టీమ్ ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. శుభమన్ […]
క్రికెట్ అభిమానుల హై వోల్టేజ్ మ్యాచ్‌లు మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. మ్యాచ్‌లు ఎలా ఉంటాయో గానీ యాడ్స్ మాత్రం వోల్టేజ్ ఎక్కువై షాక్ కొడుతున్నాయి. సోనీ టీవీ ప్రకటనల ధరలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ప్రసారం హక్కుల్ని కైవసం చేసుకున్న సోనీ టీవీ విడుదల చేసిన ప్రకటనల ధరలు […]
టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్, ప్రముఖ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి ఎవరు తప్పించారో రివీల్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్‌లో ప్రముఖ కామెంటేటర్‌గా ఉన్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హఠాత్తుగా అందులోంచి తప్పుకున్నారు. కానీ అసలు విషయం ఐపీఎల్ యాజమాన్యం అతడిని తప్పించింది. ఆ తరువాత ఇర్ఫాన్ పఠాన్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. కామెంటేటర్‌గా […]
ఐపీఎల్ 2026 కోసం ఫ్రాంచైజీలు అప్పుడే సన్నాహాలు ప్రారంభించేశాయి. ఇంటర్నల్ ట్రేడింగ్‌లో భాగంగా ఆటగాళ్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంజూ శామ్సన్ కోసం ఇప్పుడు రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. సంజూ శామ్సన్ కోసం కొత్తగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బేరసారాలు మొదలెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఓ మంచి కెప్టెన్ అవసరం ఉంది. అందుకే ఈ జట్టు యాజమాన్యం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్‌పై కన్నేసింది. […]
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త మనవరాలితో జరిగిన నిశ్చితార్ధంలో రెండు కుటుంబాల వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత జట్టు మాజీ క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లిపీటలెక్కుతున్నాడు. ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ […]
ఐసీసీ వన్డే ప్రపంచకప్ తిరిగి జరిగేది 2027లో. టీమ్ ఇండియాకు సారధ్యం వహించేది రోహిత్ శర్మేనా అంటే కావచ్చనే అన్పిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీమ్ ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటన ఉంది. ఆ దేశంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డేలు ఆడుతుంది. 2026 జూలై 1న ప్రారంభమై 19వ తేదీన ముగుస్తుంది. ఇది ఐసీసీ […]
క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇది టెన్షన్ పెట్టే వార్త కావచ్చు. త్వరలో వన్డే క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవచ్చనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ పుకార్లలో నిజమెంత ఉందో గానీ ఓ ఫోటో ఈ ప్రచారానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 తరువాత క్రికెట్ నుంచి కాస్త దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఇళ్లు తీసుకుని […]