యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రన్ రాజా రన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శర్వా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో గమ్యం, ప్రస్థానం మూవీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. 2003లో ఐదో తారీఖు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శర్వానంద్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. 2014 రన్ రాజా రన్ చిత్రంతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న శర్వానంద్ కి తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. గత ఏడాది రిలీజ్ అయిన ఒకే ఒక జీవితం మంచి టాక్ వచ్చింది. శర్వానంద్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీలో ఎంతోమంది యువ హీరోలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ కొంతంమంది హీరోలు మాత్రం ఒకటీ రెండు హిట్ చిత్రాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. అలాంటి వారిలో శర్వానంద్ ఒకరు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడని ఇండస్ట్రీ టాక్. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా శర్వానంద్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. జాను మూవీలో షూటింగ్ సమయంలో శర్వాకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల ఆయన కొంతకాలం తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఒక సర్జరీ చేయించుకోవడానికి శర్వానంద్ అక్కడికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
సర్జరీ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడని తెలుస్తుంది. ఇటీవల బేబీ ఆన్ బోర్డ్ అనే మూవీకి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి తో ఓ మూవీలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే ఇటీవల శర్వా ఒక ఇంటివాడు అయ్యాడు. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డితో వివాహం జరిగింది. శర్వానంద్ కి ఆపరేషన్ అన్న విషయం తెలిసిన తర్వాత అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.