పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు.. అలానే జీవం ఉన్న ప్రతిది నశిస్తుంది. ఇక ఆత్మ, పునర్జన్మ ఇలాంటి వాటి మీద బోలెడన్ని వాదనలు. ఇప్పుడు మనం ఆ టాపిక్ మీదకు వెళ్లడం లేదు కానీ.. కొన్ని చావులు మాత్రం చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతాయి. వారు ఎందుకు, ఏ కారణం చేత చనిపోయారు వంటి కారణాలు మాత్రం తెలియవు. ఏళ్లు గడుస్తున్న కొద్ది అవి అంతు చిక్కని మిస్టరీలుగా మారుతాయి. ఈ కోవకు చెందిన ఓ డెత్ మిస్టరీ […]
Rosalia Lombardo: మీకు మమ్మీల గురించి తెలిసే ఉంటుంది. వందల ఏళ్ల క్రితం ఈజిప్షియన్లు చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరిచి ఉంచారు. అలా భద్రపరచబడ్డ మృతదేహాలనే మమ్మీలు అంటున్నారు. కేవలం ఈజిప్టులోనే కాదు.. ప్రపంచంలోని చాలా చోట్ల మమ్మిఫికేషన్ వాడుకలో ఉండింది. మమ్మిఫికేషన్ ద్వారా భద్రపరిచిన మమ్మీలు తవ్వకాలు జరిపినపుడు బయటపడుతూ వస్తున్నాయి. అలా బయటపడ్డ వాటిలో కొన్నింటికి వేల ఏళ్ల చరిత్ర.. మరికొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినవి ఉన్నాయి. వీటన్నింటికి కామన్ పోలిక ఏంటంటే.. […]
Gate Of The Sun: ఈ విశ్వం అందమైన పకృతితో పాటు అంతుచిక్కని మిస్టరీలకు కూడా పుట్టినిల్లు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు, మిస్టరీలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ 21వ శతాబ్ధంలోనూ కొన్ని మిస్టరీలు ఛేధించబడలేదు. శాస్త్రవేత్తలు కొన్నింటిపై పరిశోధనలు చేసి విసిగి వేసారిపోయారు. చివరకు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. అలాంటి వాటిలో సూర్య ద్వారం ఒకటి. గేట్ ఆఫ్ ది సన్‌గా పిలిచే ఈ […]
ఆ ఊరి జనాలను దెయ్యం భయం వణికిస్తోంది. రాత్రైతే చాలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడుపుతున్నారు. చీకటి పడగానే వింత శబ్దాలు, వికృత రూపాలు కనిపింస్తున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కాస్త ధైర్యం చేసిన కుర్రాళ్లు రాత్రుళ్లు పహారా కాయగా.. వారికి ఓ వింత ఆకారం కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో గ్రామస్థులకు దెయ్యం భయం పట్టుకుంది. ఆ గ్రామంలో రాత్రిపూట […]
ఇంటర్నేషనల్ డెస్క్- ఈ విశ్వం ఎన్నో రహస్యాలను నిక్షిప్తం చేసుకుంది. మానవుడి మేధాశక్తితో విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ఈమేరకు ఒక్కో గ్రహంపైకి వెళ్తూ ఈ విశ్వంలో మనతో పాటు గ్రహాంతరవాసులు ఎవరైనా ఉన్నారా అన్నది తెలుసుకే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇదిగో ఇటువంటి సమయంలో సుదూర తీరంలోని పాలపుంతలో తిరుగుతున్న ఓ వింత వస్తువును ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి అరుదైన వస్తువును ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందెప్పుడు చూడలేదు. ఆస్ట్రేలియాకు […]
సాధారణంగా అందరూ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తరువాత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు ఇంకొంచెం ఎక్కువయ్యాయి. అయినా కొందరు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. మరి కొంతమంది మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా జీవిస్తుంటారు. అయినా వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి వారందరికీ ఓ రోల్ మోడల్ లాంటి వ్యక్తి ఒకాయన దొరికేశాడు. ఆయన జీవన విధానం తెలుసుకుంటే మీరు కచ్చితంగా షాకవుతారు. ఎలాంటి పరిశుభ్రత గానీ, […]
మీరు నిత్యం ఉద్యోగాల్లో, ఇతర పనులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. వారంలో ఓ రోజు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ప్రతివారంలో ఏడు రోజులు ఉంటాయి. ఈ ఏడు రోజుల వారం మన జీవితంలో అంతర్భాగం. ఇది చాలా కాలంగా జరుగుతోంది. కానీ, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయని? ఎక్కువ గానీ తక్కువ గానీ రోజులు ఎందుకు ఉండవు? వారంలో ఏడు రోజులు మాత్రమే ఉండాలి, అది ఎలా ఎవరు నిర్ణయించారో […]
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింతలు- విశేషాలు ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఇంకా ప్రజలకు తెలియని ఎన్నో వింతలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో చెప్పేది ఆ కోవకు చెందిందే. దీనిని ప్రత్యక్షంగా చూడాలంటే ఫ్రాన్స్ వెళ్లాలి మరి. కానీ, అక్కడి దాకా వెళ్లే పని లేకుండా దానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో మీకోసం చెప్పేస్తున్నాం. ఇలాంటి వింత రాళ్లను మన దేశంలోనూ చాలా ఆలయాల వద్ద చూసే ఉంటారు. […]
తిరుపతిలో భూమిలో నుండి బావి అమాంతం పైకి వచ్చిన ఘటన.. దేశ వ్యాప్తంగా అందరిని షాక్ కి గురి చేసింది. అయితే.. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. జియాలజీ ప్రొఫెసర్స్ ఈ విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. మరి.. మిస్టరీ వెనకున్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం. తిరుమల- తిరుపతిలో ప్రజలు వర్షాలతో పడిన ఇక్కట్లు చూసి యావత్ రాష్ట్రమే కళ్లనీళ్లు పెట్టుకుంది. గత 30 ఏళ్ళ చరిత్రలో రాయలసీమ ఎరుగని వర్షం అది. చిత్తూరు జిల్లా […]
ఉత్తర్ ప్రదేశ్- ఈ ప్రపంచంలో ఒక్కోసారి భలే విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం అస్సలు నమ్మలేని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. మనం నమ్మవేకపోయినా మన కళ్లముందు సాక్షాత్సరిస్తుంటే మనం మాత్రం ఏంచేయగలం చెప్పండి. అందరితో పాటు మనం కూడా నోరెల్లబెట్టడం తప్ప. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగి ఓ ఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలేం జరిగిందంటే.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెల్చేశారు. ఇంకేముంది […]