సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు. ఆ వ్యసనంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో ఆ వైద్యుడి కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. భార్యాపిల్లలతో అన్యోన్యంగా సాగుతున్న డాక్టర్ జీవితంలో అంధకారం నెలకొంది. జూదానికి బానిసై సర్వం కోల్పోయాడు. భర్యాను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ఆ తర్వాత పెను విషాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే?
విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సాయి సుధీర్ అసిస్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేశాడు. 2009 లో డాక్టర్ సాయి సుధీర్‌తో సత్యవాణికి వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అప్పటి వరకు ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో అలజడి రేగింది. ఉన్నట్టుండి ఆ వైద్యుడు జూదానికి బానిసై, డ్యూటీకి వెళ్లకుండా దాదాపు రూ. 70 లక్షల వరకు అప్పు చేశాడు. ఇది గమనించిన భార్య అతడిని ప్రశ్నించగా ఆమెతో గొడవకు దిగాడు.
అప్పులు ఎక్కువ అవడంతో అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో సత్యవాణి భర్త వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేసిన డాక్టర్ సాయి సుధీర్ కొడుకును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న సత్యవాణి తల్లిదండ్రులు అల్లుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి డాక్టర్ సాయి సుధీర్ ను అదుపులోకి తీసుకున్నారు.