అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం పురిటి నొప్పులను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణికి ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డల ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది.
అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం పురిటి నొప్పులను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణికి ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డల ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది. వారికి విద్యా బుద్దులు నేర్పి, తప్పు ఒప్పులు తెలుసుకునేలా చేసి, దండించి, మందలించి తప్పుడు మార్గంలో బిడ్డలు నడవకుండా చూస్తుంది తల్లి. కానీ పిల్లల్ని కంటారు కానీ.. వారి బుద్దులు ఎరుగలేరు తల్లిదండ్రులు. మంచి వాతావరణంలో పెరిగినప్పటికీ.. కొంత మంది పిల్లలు పెడదోవ పెడుతున్నారు. బాధ్యతాయుతంగా మెలగాల్సిన పౌరులు తప్పుడు దారిలో నడుస్తూ.. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
తనకు పెళ్లి చేయడం లేదన్న అక్కసుతో ఓ కుమారుడు తల్లినే అతికిరాతకంగా చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం బండ మైలారంలో మిరియాల వెంకటమ్మ భర్త చనిపోవడంతో చిన్న దుకాణం పెట్టుకుని బతుకుతోంది. ఆమెకు కూతురు శైలజ, ఈశ్వర్ అనే కుమారుడు ఉన్నాడు. శైలజకు వివాహం చేసింది తల్లి. అయితే గురువారం తెల్లవారు జామున వెంకటమ్మ రక్తపు మడుగుల్లో శవమై కనిపించింది. ఇదే విషయాన్ని కుమార్తెకు ఫోన్ చేసి చెప్పింది చిన్నమ్మ. అక్కడకు వచ్చి చూడగా.. మెడ కోసి, రెండు కాళ్లు నరికేసి ఉండటం చూసి భోరున విలపించింది.
తన తల్లిని హతమార్చి కాళ్లకున్న వెండి కడియాలు దొంగిలించుకుపోయారని ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సోదరుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సోదరుడు ఈశ్వర్, అతడికి సహకరించిన రాములను అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు పెళ్లి చేయడం లేదనే కారణంతోనే రాము అనే వ్యక్తితో కలిసి తన తల్లిని హత్యచేశానని, ఎవరికీ అనుమానం రాకూడదనే కాళ్లు నరికి వెండి కడియాలు దొంగిలించామని ఈశ్వర్ నేరం అంగీకరించాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకుని.. వారిని కోర్టులో హాజరుపరిచారు.