చదువుకోవాలని ఉన్నా.. అందరికీ ఓ పట్టాన ఎక్కదు. చదువులో రాణించడం అంటే మామూలూ మాటలు కాదూ. అందరికీ లభించని అరుదైన సొత్తు చదువు. అయితే చదువులో పేదింట్లోని సర్వస్వతి పుత్రులు మెరుస్తున్నారు. చదువులో మెండుగా రాణిస్తున్నారు.
చదువు ఓ పట్టాన ఎవరికీ అబ్బదు. చదువులో రాణించడం అంటే మామూలూ మాటలు కాదూ. అందరికీ లభించని అరుదైన సొత్తు చదువు. అయితే చదువులో పేదింట్లోని సర్వస్వతి పుత్రులు మెరుస్తున్నారు. చదువులో మెండుగా రాణిస్తున్నారు. కానీ వారిని లక్ష్మిదేవి వరించడం లేదు. దీంతో చదువుకోవాలన్నా ఆసక్తి ఉన్నా చదువును కొనాల్సిన పరిస్థితుల్లేక.. విద్యకు దూరమౌతున్నారు. చదువుకోవాలన్న ఆశతో కొంత మంది దాతలను ఆశ్రయిస్తుంటారు. మరికొంత మంది మిన్నకుండిపోతుంటారు. తాజాగా ఓ యువకుడు తన ఎంబీబీఎస్ కలను నేరవేర్చుకోవాలనుకున్నాడు. కష్టపడి చదివాడు. మంచి ర్యాంక్ సాధించాడు. కానీ అతడిది రొక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీ. దీంతో ధనవంతులకే సాధ్యమయ్యే వైద్య విద్యను అభ్యసించేందుకు విరాళం కోసం అర్థిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ హుస్సేన్, హసీనా భార్యా భర్తలు. వీరి కుమారుడు తాషేర్ షరీఫ్ చిన్నప్పటి నుండి చదువులో రాణిస్తున్నాడు. దీంతో తమ కష్టం తెలియకుండా చదివించారు తల్లిదండ్రులు. తండ్రి భవన నిర్మాణ కార్మికుడు కాగా, తల్లి టైలర్ పని చేస్తూ ఉంటుంది. ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన షరీఫ్.. నీట్ పరీక్షల్లో 497 ర్యాంకు సాధించాడు. అతడికి ఎంబీబీఎస్ సీటు ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో వచ్చింది. అయితే ఒకేసారి రూ. 60 వేలు కట్టాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉంది ఆ కుటుంబం. ఈ నెల 26 లోపు కళాశాలలో డబ్బు చెల్లిస్తే కానీ, ఆ సీటు దక్కదు. దీంతో ఆర్థిక సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. వీరికి సాయం చేయాలనుకుంటే – 9701321129 ఈ నెంబర్ కు కాంటాక్ట్ కావొచ్చు.