రెండు రోజుల వ్యవధిలో రెండు పండుగలు వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అదే సందడి నెలకొంది. ఓ వైపు చంద్రయాన్ విజయం. మరో వైపు జాతీయా ఉత్తమ నటుడు అవార్డ్ ఈ రెండు మన దేశంలో జరిగాయి.
రెండు రోజుల వ్యవధిలో రెండు పండుగలు వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అదే సందడి నెలకొంది. ఓ వైపు చంద్రయాన్ విజయం. మరో వైపు జాతీయా ఉత్తమ నటుడు అవార్డ్ ఈ రెండు మన దేశంలో జరిగాయి. లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఎన్నడు లేని విధంగా 2023 సంవత్సరంలో జాతీయ అవార్డ్ ల పంట పంట పండింది. అయితే గత 68ఎళ్ళ నుండి అందని ద్రక్షగా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్టకేలకు మన తెలుగు హీరోకి దక్కింది. ఈ సంవత్సరం ఏకంగా టాలీవుడ్ కి 11 అవార్డ్స్ వచ్చాయి. ఎన్టీఆర్, ఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, తర్వాత తరం అయిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున.
వెంకటేష్, ఇక ఈ తరం మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, వంటి ఎందరో స్టార్స్ దీన్ని అందుకోవాలని చూశారు. కానీ అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. చివరకు ఇన్నేళ్ళకు 69వ జాతీయ అవార్డ్ దక్కింది. అది కూడా ఉత్తమ విభాగంలో అందులోనూ.. ఐకాన్ స్టార్‌కి ఇది దేశ సినీ చరిత్రలోనే ఓ సంచలనం అని చెప్పవచ్చు. అసలు ఏం చూసి ఇచ్చారు అల్లు అర్జున్ కి ఉత్తమ అవార్డ్ ఒక సారి ఆలోచిస్తే చాలా సమధానాలు కనిపిస్తాయి.
హీరో అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని గిరి గీసుకోని నటించలేదు బన్నీ. ప్రతి సినిమాలోనూ తన స్టైల్ తో ప్రత్యేకతని ప్రదర్శించేవాళ్ళు వాణిజ్య హంగులతో రూపొందే తెలుగు సినిమాకి తగ్గ కథనాయకుడు అనిపించుకున్నాడు. అందుకే తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగాడు. అయితే గత చిత్రాలన్నీ ఒకెత్తు ఫుష్ప ది రైజ్ మరో ఎత్తు. ప్రతి సినిమాలో స్టైల్ గా కనిపించే అల్లు అర్జున్ ఈ మూవీతో పూర్తిగా మారిపోయాడు. ఈ పాత్రకోసం మొరటు మనిషిల గుబురు గడ్డం పెంచుకొని పుష్పలో కనిపించాడు. ఈ పాత్రకోసం తన హావభావాలను మార్చుకున్నాడు. కిలో మీటర్ల కొద్ది అడవుల్లో ప్రయాణం, గంటల కొద్ది మేకప్ ఇలా సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు బన్నీ. ఆ కష్టనికి ఫలితమే నేడు వచ్చిన జాతీయా పురస్కారం. స్టైలిష్ స్టార్ గా ఉన్న బిరుదు కాస్తా ఐకాన్ స్టార్ గా మారిపోయింది. దిన్నీ తీర్చిదిద్దిన సుకుమార్ కి బన్నీ ఎంతో రుణపడి ఉంటాడు.
అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. బాలనటుడిగా విజేత, స్వాతిముత్యం చిత్రాల్లో నటించాడు. గంగోత్రితో కథానాయకుడిగా మారాడు. ఈ సినిమా చూసినవారందరు అనేక రకాలుగా విమర్శించారు. ఆ తర్వాత ఆర్యతో అందరిమనసులు దోచుకున్నాడు. ఆ తరువాత తన పేరునే బన్నీగా పెట్టి హిట్ కొట్టాడు. ఆ వెంటనే హ్యాపీ సినిమా చేశాడు. అది అందరిని హ్యాపీ చేయలేకపోయింది. కొంచెం గ్యాప్ ఇచ్చి దేశముదురుతో దేశాన్ని చూట్టేశాడు.
సౌత్ లో మొదటి సిక్స్ పాక్ చేసిన హీరోగా రికార్డ్ సాధించి, అందరినీ పరుగు పెట్టించాడు. ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్ జులాయి, ఇద్దరమ్మయిలతో, రెసుగుర్రం, ఎవడు, సన్నాఫ్ సత్యముర్తి, రుద్రమదేవి సినిమాలతో తన మార్క్ ని క్రియోట్ చేసుకున్నాడు. సరైనోడు తో హిట్ కొట్టి డిజే గా దమ్ము దులిపి, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియాతో కొత్త కథలకు నాంది పలికాడు. అలా వైకుంఠపురములో అందరిని మెప్పించి, పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేసి మరి తగ్గేదేలే అంటున్నారు. బన్నీకి ఫ్యాన్స్ అయినందుకు గర్వంగా ఉంది అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.