మనం పిల్లలకు కథలు చెప్పే సమయంలో ఏ జంతువు గురించి గొప్పగా చెప్పము కానీ.. సింహం అనగానే.. మన గొంతులో కూడా మార్పు చోటుచేసుకుంటుంది. అడవికే కాదూ, జంతువులన్నింటికీ రారాజు అని, దాని దర్పం, ఠీవి, ధైర్యం, వేటాడే విధానం గురించి కథలు కథలుగా చెబుతుంటాం
మనం పిల్లలకు కథలు చెప్పే సమయంలో ఏ జంతువు గురించి గొప్పగా చెప్పము కానీ.. సింహం అనగానే.. మన గొంతులో కూడా మార్పు చోటుచేసుకుంటుంది. అడవికే కాదూ, జంతువులన్నింటికీ రారాజు అని, దాని దర్పం, ఠీవి, ధైర్యం, వేటాడే విధానం గురించి కథలు కథలుగా చెబుతుంటాం. దాని గాండ్రింపు దగ్గర నుండి దాని హావ భావాలను మనమే పలికేస్తూ.. సింహం పేరు వినబడితేనే గజ గజ వణికేలా మాట్లాడుతుంటాం. అయితే సింహం మాంసాహారి అన్న విషయం తెలిసిందే. అది జంతువులను వేటాడి తింటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సింహం మాత్రం పూర్తి శాకాహారిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆకులను భుజిస్తుంది మరీ.
ఓ సింహం శాకాహారిగా మారిపోయి కేవలం ఆకులు, అలములు తింటోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. చూడటానికి వింతగా ఉన్న ఈ వీడియోలో సింహం మాత్రం ఆకులు తినడం కనిపిస్తోంది. ‘కడుపు కాలితే.. గుర్రం కూడా వరిగడ్డి తింటుంది’అని సామెతను రుజువు చేస్తూ సింహం ఆకులను తింటోంది. దీనిపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. శ్రావణ మాసం కదా.. అందుకే శాకాహారిగా మారిపోయిందని ఒకరు.. సత్యయుగం సమీపిస్తుందని మరో నెటిజన్ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ సింహం ఆకులు తినడం నిజంగా వింతే మరీ.