టీమిండియా స్టార్ ప్లేయర్ ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా తిరుగులేదని నిరూపించాడు. ఒక చిన్నారికి సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయపడ్డ అయ్యర్ న్యూజిలాండ్ కి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇక తాజాగా NCA లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆసియా కప్ లో చోటు దక్కించుకునేసదుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఆసియా కప్ కి జట్టుని ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ మెగా టోర్నీకి ఎంపికవుతాడని అభిమానులతో పాటు ఎక్సపర్ట్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అయ్యర్ చేసిన ఒక మంచి అందరి మనసులని గెలుచుకుంటుంది. చిన్నారికి సహాయం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శ్రేయాస్ అయ్యర్ ఎంత గొప్ప బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ కి తగ్గట్టు తన బ్యాటింగ్ టెక్నీక్ మార్చుకుంటూ భారత క్రికెట్ జట్టుకి కీలక ప్లేయర్ గా మారాడు. అయితే అయ్యర్ ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ తన గొప్ప తనాన్ని చాటుకున్నాడు ప్రస్తుతం బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటున్న అయ్యర్ బుధవారం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కార్ లో వెళ్తున్న అయ్యర్ దగ్గరకి ఒకతను చిన్నారిని ఎత్తుకుంటూ వచ్చి సహాయం కోరాడు. అయ్యర్ వారిని చూసి ఆప్యాయంగా పలకరించి వారికి కొత్త డబ్బు ఇచ్చి పంపించేశాడు. అంతేకాదు తన పక్కన ఉన్న మరో వ్యక్తికి కూడా అయ్యర్ సహాయం చేసాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మా అయ్యర్ మనసున్న మారాజు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అయ్యర్ చేసిన సహాయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
A kind gesture from Shreyas Iyer.
– He is winning hearts of all people. pic.twitter.com/l5jSIB0DZI
— Johns. (@CricCrazyJohns) August 16, 2023