యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.
NCA లో ఉన్న భారత ఆటగాళ్లకు ఫిట్ నెస్ టెస్టులని నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్‌సీఏలో జరిగిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయినట్టు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇన్‌స్టా స్టేటస్‌లో కోహ్లీ యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించినట్టు తెలిపాడు. అంతేకాదు ‘భయంకరమైన శంఖాల మధ్య ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసినప్పుడు కలిగే ఆనందమే వేరుగా ఉంటుంది..’ అంటూ కాప్షన్ కూడా జోడించాడు. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇప్పుడు ఈ విషయంలో బీసీసీఐ కోహ్లీ మీద సీరియస్ అవుతుంది. ఇంతకీ బీసీసీఐ కోహ్లీ మీద ఎందుకు సీరియస్ అయిందో ఇప్పుడు చూద్దాం.
యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం. కోహ్లీ ఇలా యోయో టెస్టు స్కోర్ ని బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు ఏ మాత్రం నచ్చలేదని తెలుస్తుంది. జట్టుకి సంబంధించిన రహస్య సమాచారాన్ని షేర్ చేయొద్దని ఆటగాళ్లకు హెచ్చరించాం. వారు తమ ట్రైనింగ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకున్నా పర్లేదు కానీ జట్టు అంతర్గత విషయాలను వారి స్కోర్లను ఇలా బహిర్గతం చేయకూడదు. ఇది వారి కాంట్రాక్ట్ కి విరుద్ధం” అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో పేర్కొన్నారు.
ఇక ఐర్లాండ్ టూర్‌లో మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, సంజూ శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా నేరుగా బెంగళూరులోకి చేరుకుని, ఎన్‌సీఏ క్యాంపులో పాల్గొంటారు. కెఎల్ రాహుల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఈ నెల 30 నుంచి ఆసియా కప్ జరగనుంది. సెప్టెంబర్ 2 న భారత్- పాకిస్థాన్ తలపడతాయి. మరి కోహ్లీ యోయో టెస్టులో సాధించిన స్కోర్ ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంపై బీసీసీఐ తీరు మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.