ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
భారత జట్టు ఓటమి భయంతోనే పాకిస్థాన్‌కు రావడం లేదని.. అది చెప్పకుండా ఏవో కుంటిసాకులు చెబుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ అంటున్నారు. మరి అందులో నిజమెంతా?
ఆసియా కప్ ఎక్కడ జరగాలో ఎట్టకేలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చేసింది. ఆసియా కప్ 2023ను పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తామని ఏసీసీ ప్రకటించినా.. బీసీసీఐ సైతం తన పంతం నెగ్గించుకుంది.
ఆసియా కప్ 2023 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. దాంతో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా, పాక్ కు రాదు అని బీసీసీఐ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఈ టోర్నీ నిర్వాహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నీ విషయమై ప్రధాని మోదీని కలుస్తానని పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్దతే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజాం సేథీ కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ ను ఇండియాకు పంపాలంటే మాకు కూడా భయంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ విషయంలో ఫైనల్లీ భారత క్రికెట్ బోర్డ్ పంతం నెగ్గించుకుంది! దీంతో టీమిండియా ఆడే మ్యాచులపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మటల యుద్ధం జరుగుతూనే ఉంది. 2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. టీమిండియా పాక్ లోకి అడుగు పెట్టదని బీసీసీఐ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో ఆసియా కప్ 2023 ను పాకిస్థాన్ లో నిర్వహించాలా? లేక యూఏఈ లాంటి దేశాలకు తరలించాలా? అన్న విషయంపై చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి షెడ్యూల్ […]
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ ఏదైన ఉందంటే.. అది భారత్-పాక్ మ్యాచ్. ఈ రెండు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయంటే.. అదో మినీ యుద్ధమే. గెలుపుకోసం ఇరుదేశాల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వివిధ కారణాల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే […]
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. ప్రపంచం మొత్తం క్రికెట్ మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంది. అయితే.. కొన్నేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. పాకిస్థాన్‌లో క్రికెటర్లపై బాంబు దాడి, ఇండియాలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ […]
‘భారత్- పాకిస్తాన్‘ ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉండే కిక్కే వేరు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్ వైపే ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేమికులైతే.. ఆరోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. అయితే.. సరిహద్దు వివాదాలు, దౌత్య కారణాల కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగటం కనుమరుగైపోయింది. ఏదో అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడతున్నా.. అవి అభిమానులకు సరిపొవట్లేవు. ఇదిలావుంచితే.. ఇకపై ఈ ఇరు జట్ల ప్రతిష్టాత్మక టోర్నీల్లో […]