టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఓపెనర్ గా చాలా సంవత్సరాల పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కి చెక్ పెట్టారు సెలక్టర్లు.
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ప్రస్తుతం ఏమి కలిసి రావడం లేదు. ఫామ్ లేమితో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ ఓపెనర్ స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. తాజాగా ఆసియా కప్ కోసం సెలక్ట్ చేసిన 17 మంది ప్రాబబుల్స్ లో ధావన్ కి చోటు దక్కలేదు. టెస్టు, టీ 20 జట్టులో ప్లేస్ కోల్పోయిన ఈ స్టార్ ఓపెనర్ వన్డేల్లో మాత్రం నిలకడగా ఆడుతూ తన చోటుకి ఎలాంటి ముప్పు లేదని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. అయితే న్యూజీలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లో వరుసగా విఫలమైన ధావన్ కి సెలక్టర్లు గట్టిగానే షాకిచ్చారు. కిషాన్, గిల్ లాంటి యంగ్ ప్లేయర్లు రాణించడంతో వన్డేల్లో ధావన్ పై వేటు వేయక తప్పలేదు.
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఓపెనర్ గా చాలా సంవత్సరాల పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కి చెక్ పెట్టారు సెలక్టర్లు. ఐసీసీ టోర్నీలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్.. ఆసియా కప్ లో చోటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది. దీంతో ధావన్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టుగానే కనిపిస్తుంది. ఆసియ కప్ లో ధావన్ చోటు దక్కకపోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ ధావన్ భారత జట్టుకు ఎంతో చేశాడని.. ఐసీసీ టోర్నీల్లో అతడి గణాంకాలు అద్భుతమని కొనియాడాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధవన్‌ను జట్టుకు ఎంపిక చేసే ఆలోచనలేదని తెలిపాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను ఓపెనర్లుగా పరిగణిస్తున్నామని అతను పేర్కొన్నాడు.
సీనియర్ ప్లేయర్ గా ధావన్ జట్టులో ఉంటే కలిసొచ్చే విషయమే. ధావన్ అనుభవంతో పాటు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ అదనపు బలం. పైగా ఐసీసీ టోర్నీలో మంచి రికార్డ్ ఉండడంతో పాటు ఒత్తిడిని కూడా అధిగమించగలడు. కానీ సెలక్టర్లు మాత్రం కుర్రాళ్ళ వైపే మొగ్గు చూపారు. ఈ నెల 30 న ఆసియా కప్, అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ లో సెలక్ట్ కాకపోతే వరల్డ్ కప్ కి ఎంపికవ్వడం అసాధ్యమైన పని. వరల్డ్ కప్ కి సెలక్ట్ కాకపోతే ధావన్ కెరీర్ లో దారులు మూసుకుపోయినట్టే. ఇప్పటికే టెస్టు, టీ 20 ల్లో స్థానం కోల్పోయిన ధావన్ వన్డే కెరీర్ కూడా త్వరలోనే ముగిసే అవకాశం కనిపిస్తుంది. మరి ధావన్ ని వరల్డ్ కప్ కి ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Ajit Agarkar said, “Shikhar Dhawan has been terrific for India, but currently Rohit Sharma, Gill and Kishan are our 3 preferred openers”. pic.twitter.com/LMg0MyGTVf
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2023