ప్రస్తుతం టీమిండియాలో నెంబర్ 4 స్థానంలో కొంత అనిశ్చితి ఉన్నమాట నిజం. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ స్థానం మార్చి అతన్ని బలిపశువు చేయొద్దని సూచించాడు.
2023 టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఆసియా కప్ తో పాటుగా స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలు గెలవడం మన జట్టుకి చాలా ముఖ్యం. గతేడాది ఆసియా కప్ టీ 20 లో భాగంగా కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఈ సారి ఆసియా కప్ ఎలాగైనా కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీ లేని భారత క్రికెట్ జట్టుకి ఈ ఏడాది సొంత గడ్డపై ఆడనుండంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ రెండు మెగా టోర్నీలకు ముందు టీమిండియా లోని మరోసారి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ విషయంలో ఒక కీలక సలహా ఇచ్చాడు.
ప్రస్తుతం టీమిండియాలో నెంబర్ 4 స్థానంలో కొంత అనిశ్చితి ఉన్నమాట నిజం. అయితే ఈ సమస్య భారత్ కి కొత్తేమీ కాదు.2015 నుంచి ఈ సమస్య వెనటుడుతూనే ఉంది. 2015 లో అజింక్య రహానే పర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. ఇక 2019 లో ఒక్కరు కూడా ఈ స్థానంలో ఒక్కరు కూడా కుదరుకోలేకపోయారు. తాజాగా.. 2023 వరల్డ్ రానున్న నేపథ్యంలో అయ్యర్ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోతే ఎవరు ఈ స్థానాన్ని భర్తీ చేస్తారు అనే విషయానికి సమాధానం లేదు. అయితే భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ ఎవ్వరూ లేకపోతే నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని ఆడించమని సలహా ఇచ్చాడు. అయితే సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ స్థానం మార్చి అతన్ని బలిపశువు చేయొద్దని సూచించాడు.
మంజ్రేకర్ మాట్లాడుతూ “‘నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకుంటే ఇషాన్ కిషన్‌ని ఆడించొచ్చు. అంతేకానీ విరాట్ కోహ్లీని ఆడించడం కరెక్ట్ కాదు. అది అతన్ని బలపశువుగా మార్చినట్టు అవుతుంది. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సమయంలో అతని బ్యాటింగ్ స్థానంపై చర్చ అనవసరం. కోహ్లీని నాలుగో స్థానంలో పంపకపోవడమే మంచిది. 2007 వరల్డ్ కప్ సమయంలో ఇలాగే జరిగింది. రాహుల్ ద్రావిడ్, గ్రెగ్ ఛాపెల్ కలిసి సచిన్ టెండూల్కర్‌ని ఓపెనర్‌గా కాకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపారు. టాపార్డర్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడని సచిన్‌ని నాలుగో స్థానంలో పంపడం టీమిండియా చావుదెబ్బ తీసింది. అయితే ఆ ప్రయోగం బెడిసి కొట్టింది. ప్రస్తుతం అలాంటి ప్రయోగాలేమి మేనేజ్మెంట్ చేయకుండా ఉంటె మంచిది” అని సూచించాడు.
కాగా విరాట్ కోహ్లీకి నాలుగో స్థానంలో అద్భుతమైన రికార్డ్ ఉంది. 42 వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ, 7 సెంచరీలు, 55.21 యావరేజ్‌తో 1767 పరుగులు చేశాడు. 2011 లో నాలుగో నెంబర్ లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ కొన్ని కెలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక 2015, 2019 లో విరాట్.. తనకిష్టమైన మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేసాడు. యువరాజ్ సింగ్ తర్వాత కొన్నేళ్లపాటు నాలుగో స్థానంలో బాగా రాణించిన కోహ్లీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. 2015 వరల్డ్ కప్ కి ముందు కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించి పరీక్షించిన ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. మరి మంజ్రేకర్ చెప్పినట్లుగా కోహ్లీని బ్యాటింగ్ ఆర్డర్ మర్చి టీమిండియా ఏమైనా ప్రయోగాలు చేస్తుందా ? లేకపోతే మూడో స్థానంలోనే బ్యాటింగ్ కి వస్తాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.