క్రికెట్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అందనుంది. ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ మ్యాచులను కూడా ఫ్రీగా చూసే అవకాశం హాట్ స్టార్ కల్పించింది.
2023 టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఆసియా కప్ తో పాటుగా స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలు గెలవడం మన జట్టుకి చాలా ముఖ్యం. గతేడాది ఆసియా కప్ టీ 20 లో భాగంగా కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఈ సారి ఆసియా కప్ ఎలాగైనా కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీ లేని భారత క్రికెట్ జట్టుకి ఈ ఏడాది సొంత గడ్డపై ఆడనుండంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ రెండు మెగా టోర్నీలు గెలవడం సవాలుగా మారింది. అయితే ఈ సారి అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అందనుంది. ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ మ్యాచులను కూడా ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది.
ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023ను ఫ్రీగా చూసే భాగ్యం హాట్ స్టార్ అందించనుంది. గతంలో హాట్‌స్టార్‌లో మ్యాచ్ చూసేందుకు డబ్బులు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా హాట్ స్టార్ యాప్ మొబైల్ యూజర్లకు ఫ్రీగా లైవ్ ఇవ్వనుంది. అయితే.. ఇది కేవలం మొబైల్‌లో చూసేందుకే ఫ్రీ. టీవీల్లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. మరి హాట్ స్టార్ ఇచ్చిన ఈ బంపరాఫర్‌తో మరో సారి అందరి ఫోన్లలో హాట్ స్టార్ భారీ డౌన్‌లోడ్స్ అండ్ వ్యూస్‌తో దుమ్ములేపనుంది. ఇటీవలే ఐపీఎల్ మ్యాచులను జియో సినిమా ఫ్రీగా ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి హాట్ స్టార్ సంస్థ ఒక అడుగు ముందుకేస్తూ క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ నెల 30 నుంచి ఆసియా కప్, అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మరి హాట్ స్టార్ కల్పిస్తున్న ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Asia Cup & World Cup free on Hotstar in Mobile…!!!
Great news for Cricket fans. pic.twitter.com/1OO0pNSLMX
— Johns. (@CricCrazyJohns) August 21, 2023