ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఈ కుర్రాడి ఆట తీరుని కొనియాడాడు.
ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సమరంలో కార్ల్‌సన్ విజేతగా నిలిచినా.. ప్రజ్ఞానంద గట్టి పోటీ ఇచ్చాడు. 18 ఏండ్ల ప్రజ్ఞానంద 36 ఏళ్ళ కార్ల్‌సన్ కి చెమటలు పట్టించాడు. గురువారం జరిగిన టై బ్రేక్‌లో 0.5-1.5తో కార్ల్‌సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కిన ప్రజ్ఞానందతన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ కుర్రాడి ఫైనల్లో ఓడినా భారత అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓడిపోయినా నువ్వు ఛాంపియన్ వే అంటూ నిలువెత్తు దేశం గర్విస్తుంది. తాజాగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఈ కుర్రాడి ఆట తీరుని కొనియాడాడు.
ఫైనల్లో భాగంగా జరిగిన రెండు క్లాసిక్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. టై బ్రేక్‌లో తడబడ్డాడు. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ నెగ్గిన కార్ల్‌సన్‌కు వరల్డ్ కప్‌లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. టై బ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి ర్యాపిడ్ గేమ్‌లో తన అనుభవాన్నంతా రంగరించి విజయం సాధించిన కార్ల్‌సన్.. రెండో గేమ్‌ను ఉద్దేశపూర్వకంగానే ‘డ్రా’ చేసుకున్నాడు. దీంతో మెరుగైన పాయింట్ల ద్వారా నార్వే గ్రాండ్‌మాస్టర్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు రూ. 91 లక్షలు, రన్నరప్ ప్రజ్ఞానందకు రూ. 66 లక్షల నగదు బహుమతి దక్కింది.
ఈ ఓటమిపై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ “ప్రజ్ఞానంద నువ్వు రన్నరప్ కాదు.. ఇది నీకు రనప్ మాత్రమే. భవిష్యత్తులో నువ్వు సాధించే గోల్డ్ మెడల్, మరిన్నీ విజయాలకు ఓ గుణపాఠం మాత్రమే. ఈ ఓటమి అనేక యుద్దాలు చేయడానికి కావాల్సిన పాఠాన్ని నేర్పిస్తోంది. భవిష్యత్తులో నువ్వు విజయం సాధించిన అనంతరం మేమంతా మళ్లీ అభినందిస్తాం.’అని ట్వీట్ చేశాడు. మరి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర సైతం ప్రజ్ఞానందను ప్రశంసించాడంటే అతని ప్రతిభ ఎంతో మనకి అర్ధం అవుతుంది. చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్ గా నిలవలేకపోయినా చుక్కలు చూపించాడు. మొత్తానికి ఆనంద్ మహీంద్ర ట్వీట్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈
Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏
On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS— International Chess Federation (@FIDE_chess) August 24, 2023