ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మరోసారి ఈ వరల్డ్ కప్ భారత్ లో నిర్వహిస్తున్నారు. ఇక స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో వరల్డ్ కప్ మీద అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్ళు దాటిపోయిన టీమిండియాకు ఈ సారి వరల్డ్ కప్ గెలవడానికి ఇదొక సువర్ణావకాశంగానే చెప్పుకోవచ్చు. గత మూడు వరల్డ్ కప్ తీసుకుంటే స్వదేశంలో నిర్వహించిన జట్టే వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈ సారి కప్ మన టీమిండియాకే అని అభిమానుల నుంచి ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇప్పటీకే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేసింది.
రానున్న రెండు నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి రెండు పెద్ద టోర్నీలు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవరం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఈ జట్టుని ఖరారు చేశారు. ఈ మీటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు .. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొన్నాడు. అనంతరం ఈ ప్రెస్ మీట్ కి హాజరైన రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అగార్కర్ కి ఒక విచిత్రకరమైన ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో టాపార్డర్ లో పార్ట్ టైం బౌలింగ్ ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయనే ప్రశ్న ఎదరైంది.
ఈ ప్రశ్నపై వెంటనే స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. “వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, కోహ్లీ కూడా బౌలింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు” అని హిట్ మ్యాన్ సరదాగా వ్యాఖ్యానించాడు. రోహిత్ సమాధానంతో అక్కడ అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు, ముగ్గురు స్పిన్నర్లు, నలుగురు పేస్ బౌలర్లు ఉన్నారు. సెప్టెంబర్ 2 న భారత్ తమ తొలి మ్యాచ్ ని పాకిస్థాన్ తో ఆడబోతుంది. మరి రోహిత్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.
💬 “Hopefully Sharma and Kohli can roll some arm over in the World Cup” 😃#TeamIndia captain Rohit Sharma at his inimitable best! 👌#AsiaCup2023 | @imRo45 pic.twitter.com/v1KKvOLcnq
— BCCI (@BCCI) August 21, 2023