స్వదేశంలో ఈ సారి వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సారి పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఫోనులో మ్యాచులు చూసే అభిమానులకి హాట్ స్టార్ రూపంలో ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ మ్యాచులు త్వరగా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మరోసారి ఈ వరల్డ్ కప్ భారత్ లో నిర్వహిస్తున్నారు. ఇక స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో వరల్డ్ కప్ మీద అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్ళు దాటిపోయిన టీమిండియాకు ఈ సారి వరల్డ్ కప్ గెలవడానికి ఇదొక సువర్ణావకాశంగానే చెప్పుకోవచ్చు. గత మూడు వరల్డ్ కప్ తీసుకుంటే స్వదేశంలో నిర్వహించిన జట్టే వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈ సారి కప్ మన టీమిండియాకే అని అభిమానుల నుంచి ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. నెల క్రితమే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేయగా.. ఇప్పటికే కొన్ని జట్లు వరల్డ్ కప్ కోసం జట్టుని కూడా ప్రకటించేశారు. అయితే తాజాగా వరల్డ్ కప్ చూడాలనుకునే అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పేసింది.
స్వదేశంలో ఈ సారి వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సారి పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఫోనులో మ్యాచులు చూసే అభిమానులకి హాట్ స్టార్ రూపంలో ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ మ్యాచులు త్వరగా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. మాస్టర్ కార్డ్‌లు ఉన్నవారు ఈ గురువారం సాయంత్రం నుంచే వరల్డ్ కప్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే భారత్ ఆడే మ్యాచులకు మాత్రం ఈ ఎర్లీ యాక్సెస్ వర్తించదు. మాస్టర్ కార్డు వినిగదారులు భారత్ మినహా ఇతర వార్మప్ మ్యాచులు, ప్రధాన మ్యాచులకి సంబంధించిన టికెట్లు ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ తో మ్యాచులకి ఈ ఎర్లీ యాక్సెస్ వర్తించకపోయినా క్రికెట్ లవర్స్ కి మాత్రం ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కారణంగా ఇతర జట్ల మ్యాచుల మీద కూడా మన అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తారు. వరల్డ్ కప్ నెగ్గడంలో టీమిండియాకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న ప్రతి జట్టునూ అభిమానులు చాలా క్లోజ్‌గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఎర్లీ యాక్సెస్‌ను బీసీసీఐ తీసుకొచ్చి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచులో 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్ న్యూజీలాండ్ తో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తలబడుతుంది. మొత్తానికి భారత్ లో వరల్డ్ కప్ మ్యాచులను చూసే అభిమానులకి మాస్టర్ కార్డు ద్వారా గుడ్ న్యూస్ అయితే అందింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.