ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెప్పపాటున జరుగుతున్న ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, అతి వేగం, డ్రైవింగ్ పై అవగాహన లేకుండా డ్రైవ్ చేయడం ఇతర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఆటో బోల్తా పడింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా పడిన ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ నెల 22 న జరిగిన ఈ ప్రమాదాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ నుంచి ఐటీసీ కొమినూర్ వైపుగా వస్తున్న ఆటో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పైకి రాగానే అకస్మాత్తుగా బోల్తా కొట్టింది. డ్రైవర్ ఆటోని వేగంగా నడుపుతూ.. సెల్ ఫోన్ చూస్తు ఎదురుగా స్కూటీని తప్పించే ప్రయత్నం చేయబోయాడు. దాంతో ఆటో అదుపు తప్పి ఒక్కసారిగా ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. అయితే ఆటో పల్టీ కొట్టిన సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారుని చాలా చాకచక్యంగా తప్పించడం వీడియోలో చూడవొచ్చు. ఒక్క ఆటో తప్ప ఈ ఘటనలో ఏ వాహనం ప్రమాదానికి గురి కాలేదు. మొత్తానికి సినీ స్టైల్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.