కరోనా సెకండ్ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి […]