డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడో లేక సర్జరీ చేసేటప్పుడో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు. నీలం రంగు దుస్తులు కూడా ధరిస్తారు. కానీ ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులే ధరిస్తారు. దీనికి కారణం ఏంటో తెలుసా?
వైద్యో నారాయణో హరి అంటూ ఉంటారు. వైద్యులు దేవుడితో సమానం అని దాని అర్థం. వైద్య వృత్తిని దైవంగా భావించే వైద్యులు దేవుళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. వారు నిత్యం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. బతకటం అసాధ్యం అనుకున్న వారికి కూడా ప్రాణాలు పోస్తూ ఉంటారు. ఒక్కోసారి రోగుల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు. తాజాగా, ఓ డాక్టర్ తన ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తికి వైద్యం చేశాడు. […]
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వైద్యశాస్త్రంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వైద్యులు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన శస్త్రచికిత్సలు చేశారు. తాజాగా భారతదేశంలో మరో అద్భుతమైన ఆపరేషన్ ను వైద్యులు సక్సెస్ చేశారు. ఓ బాలుడికి తెగిపోయిన మర్మాంగాన్ని తిరిగి అతికించారు. అతను మళ్లీ ఎప్పటిలాగానే జీవితాన్ని కొనసాగించొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శస్త్రచికిత్స వార్త వైరల్ గా మారింది. ఆ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాకి […]
నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరుకు రైతు ఆందోళన చెందుతునే ఉంటాడు. అధికశాతం ఎలుకల వల్లే రైతన్న నష్టపోతున్నాడు. ఎందుకంటే రైతన్న ఎన్నో వ్యయ ప్రయాసలు పడి పంటను చేతికి దక్కించుకున్నాక ధాన్యాన్ని చీడ పీడలతో పాటూ ఎలుకలూ నాశనం చేస్తాయి. అలానే ఇప్పుడు తెలంగాణాలో ఓ రైతును ఎలుకలు రోడ్డున పడేశాయి. అయితే ధాన్యాన్ని తిని కాదు రైతన్న అప్పు చేసి తన వైద్యం కోసం దాచుకున్న డబ్బును కొరికి పడేశాయి. మహబూబాబాద్ జిల్లా […]
ధాయిలాండ్ లో కీటకాల్ని తింటారని మనం అనుకుంటాం వీడియోలో చూస్తాం. కానీ ఈసారి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏకంగా ఓ బొద్దింకను ఐసీయులో పెట్టి ఆక్సిజన్ అందించారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి […]
విజయవాడ విద్యాధరపురానికి చెందిన నిమ్మల సామ్రాజ్యంకు కరోనా సోకడంతో ఆమె కుమారుడు గణేష్ ఈ నెల రెండో తేదీ మంగళగిరిలోని ఓ ప్రైవేటు జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మూడో తేదీన ఆమెకు ఆరోగ్యశ్రీ కింద బెడ్ కేటాయించారు. అక్కడెవరూ పట్టించుకోకపోవడంతో గణేష్ తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లాడు. తమ ఇష్టప్రకారమే ఇంటికి తీసుకువెడుతున్నట్టు గణేష్‌చేత ఓ పత్రాన్ని ఆస్పత్రి సిబ్బంది రాయించుకున్నారు. ఇంటివద్దే వైద్యం చేయిస్తుండగా ఆమె ఈనెల ఎనిమిదో తేదీన మృతిచెందారు. అయితే ఆమెకు చికిత్స […]
కరోనా సెకండ్ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి […]