మన పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వాలని అనుకుంటాం. దానికి తగ్గట్లుగానే కష్టపడి సంపాదిస్తారు. కూడబెట్టి పిల్లలకు ఇస్తారు. కానీ కొందరు మాత్రం అలా ఆలోచించడం లేదు. సమాజం కోసం సేవ చేయాలనే సంపాదిస్తుంటారు. తాజాగా అలానే ఓ వ్యక్తి సమాజం మీద ప్రేమ.. పదిమందికి సాయం చేయాలనే ఆలోచన కలిగింది. మహిళల అభివృద్ధికి తోడ్పడాలనే ఆలోచనతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. తన సంపాదనలో కొంత సమాజసేవకు ఖర్చు చేస్తున్నాడు. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించాడు. ఎవరా […]
సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిని ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. చిన్నారికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాంటే నిందితుడు దొరకాలి. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. దీప్తికల నెరవేరితే రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా […]
సాటి మనిషి సాయం కోరినా, ప్రమాదంలో ఉన్నా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. ఏ సమయంలోనైనా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారు. సమయమేదైనా సమస్యను ఎవరుచెప్పినా, సాయం చేయాలంటూ తనకు వచ్చే ట్వీట్ల పైన వెంటనే స్పందిస్తారు ఐటీశాఖ మంత్రి తారకరామారావు. ఇందు కోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసారు. మరి సమస్యని ప్రత్యక్షంగా చూస్తే!.. సిరిసిల్లలో పర్యటించి హైదరాబాద్ వస్తున్న సమయంలో రోడ్డుప్రమాదం ఘటన ఆయన కంటపడింది. అంతే వెంటనే చలించిపోయారు.స్వయంగా క్షతగాత్రులను […]
కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. రోజు వారి కూలీపై ఆధారపడే జూ ఆర్టిస్టులు, ఇతర 24 విభాగాల అసిస్టెంట్లు రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో వాళ్లందరికీ అండగా కేజీఎఫ్ స్టార్ కరోనా విలయతాండవంలో కన్నడ హీరో యష్ గొప్ప మనసు చాటుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో ఉన్న 3వేల మంది సినీ కార్మికుల సహాయార్థం అభినందించదగ్గ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ షూటింగ్స్, థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. లాక్ డౌన్ […]
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వలన పేదప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నాటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ప్రతి రోజూ సేవలను విస్తరిస్తూ వస్తోన్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతూ వస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ కావాలని, ఆక్సిజన్ సప్లై కావాలని, మెడిసిన్స్ కావాలని ఫోన్లు, మెసేజ్ ల ద్వారా అడుగుతూనే ఉన్నారు. వారి బాధలను గుర్తించిన సోనూసూద్ […]
‘ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపం. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు […]
కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు. మందులు, ఆహారం, ఆసుపత్రి అవసరాలు, అంత్యక్రియలు ఇలా దేనికీ, ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోయినా, మేమున్నామంటూ తెలుగు రాష్ట్రాలలోని పలు స్వచ్ఛంధ సంస్థలు కరోనా రోగులకు, మృతులకు సేవలు అందిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల్లో ఎక్కువగా యువతే పనిచేస్తున్నారు. వీళ్లంతా చదువు, వ్యాపారాలు, ఉద్యోగాలు కొనసాగిస్తూనే కరోనా కష్టకాలంలో మీకు […]
వెండి తెరపై విలన్‌గా సోనూ చాలా మందికి తెలుసు. కానీ ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ‘హీరో’ అంటూ పొగుడుతున్నారు. వెనుక ముందు ఏం ఆలోచించకుండా సాయం చేస్తున్న సోనూ సూద్ ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న సాయం నుంచి సాధ్యం కాదు అన్నుకున్న సాయం కావాలన్నా అందరి చూపూ సోనూ సూద్ వైపే ఉంటోంది. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. […]
రెండో దశలో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళ సినీ తారలు అక్కడి […]