SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Nirmala Sitharaman Release State Wise Debt Details In Counter Tdp

రాష్ట్రాల అప్పులు ప్రకటించిన కేంద్రం! జగన్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టేనా?

  • Written By: Dharani
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాష్ట్రాల అప్పులు ప్రకటించిన కేంద్రం! జగన్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టేనా?

గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం అప్పుల చుట్టే తిరిగింది. మరీ ముఖ్యంగా ఏపీలో జగన్‌ ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. ఇప్పటికైనా కళ్లు తెరకవపోతే.. ఏపీ పరిస్థితి మరో శ్రీలంకలా మారుతుందని.. జోరుగా ప్రచారం చేశాయి. అయితే విపక్షాల విమర్శలని వైసీపీ గట్టిగా కౌంటర్‌ చేయలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం రాష్ట్రాల అప్పులు వివరాలు వెల్లడించింది. దాంతో ఇన్నాళ్లు వైసీపీని టార్గెట్‌ని చేసిన టీడీపీ.. ఈ వివరాలు చూసి గుడ్లు తేలేసింది. ఎలా కౌంటర్‌ చేసుకోవాలో అర్థం కాక.. నేల చూపులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రం అప్పుల వివరాలు వెల్లడించి ఇటు వైసీపీ నెత్తిన పాలు.. అటూ టీడీపీ నోటికి తాళం వేయడం రెండు ఒకే సారి చేసింది.

శ్రీలంక, పాకిస్తాన్‌లో నెలకొన్ని ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో గత కొంత కాలంగా రాష్ట్రాల అప్పులపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో లోక్‌సభలో బీజేపీ సభ్యుడు కిషన్ కపూర్ రాష్ట్రాల అప్పలు గురించి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఈ వివరాలు సభ ముందు ఉంచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ఆఫ్ 2021-2022’ని ఆధారంగా చేసుకుని 2020 మార్చి, 2021 మార్చి, 2022 మార్చి నాటికి రాష్ట్రాలకు ఎంతెంత అప్పులు ఉన్నాయో తెలిపారు.

దీని ప్రకారం… 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా రూ. 6,59,868.9 కోట్ల అప్పు ఉండగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులతో ఆ తరువాత రెండు స్థానాలలో ఉన్నాయి. 2022 మార్చి చివరినాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 3,98,903.6 కోట్లు కాగా ఇదే సమయానికి తెలంగాణ అప్పులు రూ. 3,12,191.3 కోట్లు.

Nirmalasitharaman

2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ. 6,00,006.2 కోట్ల అప్పు ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. 2021 మార్చి చివరి నాటికి సవరించిన బడ్జెట్అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,60,333.4 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,67,530.7 కోట్లు. 2020 మార్చి చివరినాటికి రాష్ట్రాల అప్పులు పరిగణనలోకి తీసుకుంటే రూ. 5,49,559.2 కోట్ల అప్పుతో ఉత్తర్ ప్రదేశ్ అందరి కంటే ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. 2020 మార్చి చివరినాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 3,07,671.5 కోట్లు కాగా తెలంగాణ అప్పు రూ. 2,25,418 కోట్లు.

కేం‍ద్రం వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకుంటే.. అప్పుల జాబితాలో ఏపీ అయితే ప్రథమ స్థానంలో లేదు. మరీ ముఖ్యంగా యూపీతో పోల్చుకుంటే.. ఆ రాష్ట్రానికి ఉన్న అప్పుల్లో సగం మాత్రమే ఏపీ రుణ భారంగా ఉంది. ఇక ఇన్నాళ్లు అప్పులపై విమర్శలు చేస్తున్న టీడీపీకి కౌంటర్‌ ఇవ్వడానికి అధికార పార్టీకి సరైన అస్త్రం దొరికింది. వాస్త‌వానికి తెలుగుదేశం హ‌యాంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ అప్పుల మీదే న‌డిచింది.

చంద్ర‌బాబు హ‌యాంలో 2014 నుంచి విప‌రీత‌మైన స్థాయిలోనే అప్పులు చేశారు. అప్పుడు అప్పులు చేసి కూడా ప్ర‌జ‌ల‌ను ఉద్ధ‌రించింది ఏమీ లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా ప్రస్తుతం వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో అప్పులు చేస్తున్నా.. ప‌థ‌కాల ల‌బ్ధి డైరెక్టుగా ప్ర‌జ‌ల‌కే క‌లుగుతోంది. ప్రభుత్వం అప్పులు చేసి ప్రజల ఖాతాల్లోకే ఆ డబ్బును పంపిస్తుంది తప్ప తమ జేబుల్లోకి వెళ్లడం లేదని అధికార పార్టీ నాయకులు టీడీపీని కౌంటర్‌ చేస్తున్నారు. ఇక కేంద్ర వివరాలు వెల్లడించడం.. అటు వైసీపీ టార్గెట్‌ చేయడంతో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి పాపం.. కక్కలేక మింగలేక అనే విధంగా తయారయ్యింది

ఇక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మోదీ పాల‌న ద‌గ్గ‌ర నుంచి వెలిగిపోతోంద‌నిపించుకుంటున్న గుజ‌రాత్ క‌న్నా, అన్నీ ఉన్న క‌ర్ణాట‌క క‌న్నా.. ఏపీ అప్పుల భారం త‌క్కువే. దేశంలోనే ప్ర‌థ‌మ స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న రాష్ట్రంగా ఏపీ నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో నిలుస్తుంది. అయితే అప్పుల్లో మాత్రం చాలా రాష్ట్ర‌ల క‌న్నా త‌క్కువ స్థాయిలోనే ఉంది. మరి కేంద్రం రాష్ట్రాల అప్పులు వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఎలాంటి కౌంటర్‌ అటాక్‌ చేస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Ap Debt’s pic.twitter.com/Io0ufFUs5j

— Sekhar Rambo (@RamboSekhar) July 26, 2022

  • ఇది కూడా చదవండి: CM జగన్ మంచి చేస్తున్నా.. ఆ ఒక్క తప్పే కొంప ముంచుతోందా?
  • ఇది కూడా చదవండి: కడపలో వింత ఘటన! YCPకి ఎదురు తిరిగిన జగన్ అభిమానులు! కారణం?

Tags :

  • Andhra Pradesh
  • central govt
  • Debt
  • latest telugu news
  • Nirmala Sitharaman
  • political news
  • tdp
  • ysrcp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam