ఎప్పుడూ సౌమ్యంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ తన పనేదో తను చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఎవరినీ కూడా చిరంజీవి టార్గెట్ చేసింది లేదు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే చిరు కూడా తన పంథా మార్చుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేశారు. అవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబు పవన్ పారితోషికంపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హీరోలకు అన్ని కోట్లు రెమ్యునరేషన్ ఎందుకు అని వైసీపీ నేతలు సందర్భం వచ్చిన ప్రతిసారి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
గతంలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. హీరోలకు అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు అన్నట్టు కామెంట్స్ చేశారు. అయితే ఏనాడూ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ మీద గానీ, ఇండస్ట్రీలో భాగమైన అంశాల పైన వస్తున్న విమర్శలపై స్పందించలేదు. కానీ తాజాగా ఆయన స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ 200 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్.. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. రవితేజ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో చిరంజీవి సినిమా గురించి చెబుతూ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని.. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు పారితోషికాలు ఎక్కువే ఉంటాయని అన్నారు. ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టుల గురించి, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని.. మీలాంటి వాళ్ళు వీటి మీద దృష్టి పెట్టి డెవలప్ చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారని కామెంట్స్ చేశారు. పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి వాటి గురించి ఆలోచించాలి అంటూ సూచించారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడడం.. దీన్నేదో పెద్ద సమస్యలా చూపించడం సరికాదని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
MEGA MASS BONDING ❤️🔥❤️🔥#200DaysOfWaltairVeerayya 🤩#WaltairVeerayya https://t.co/14aeSo2W9i pic.twitter.com/usZHxGLXCj
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 7, 2023