మన తెలుగు సినిమా పుట్టి 69 సంవత్సరాలు…69 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన హీరోలు..హీరోలంటే అలాంటి ఇలాంటి హీరోలు కాదు. తమ నటనతో కొన్ని కోట్లమంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరిన దేవ దూతలు మన తెలుగు హీరోలు. ఒక నటుడు తెలుగు సినిమా అనేది భారతీయ చిత్ర పరిశ్రమలో ఉందని నిరూపిస్తే.. ఇంకో నటుడు నటన అంటే ఇది అని చాటి చెప్పాడు. ఇంకో హీరో కొత్త కొత్త ప్రయోగాలతో సినిమా అంటే ఇదని నిరూపిస్తే ఇంకో నటుడు తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా స్పీడ్ ని పెంచాడు. వాళ్ళందరూ తమ తమ నటనతో తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చారు. కానీ వాళ్లెవరూ సాధించలేని, అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించలేని నేషనల్ అవార్డు ని అంటే జాతీయ ఉత్తమ స్థాయి నటుడి అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించడంతో యావత్తు తెలుగు సినీ ప్రేక్షకులతో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారు.

అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య నటవారసుడిగా, మెగా స్టార్ మేనల్లుడు అనే ముద్రతో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటనని చూసిన వారందరూ తన తాత అల్లు రామలింగయ్య లాగా చాలా ఈజీగా నటించాడు అనే పేరుని తెచ్చుకున్నాడు. మీరు కనుక అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు చూస్తే ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర మాత్రమే ప్రేక్షకుడికి కనబడుతుంది. తన నటనతో ఆ పాత్రకి ప్రాణం పోస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే. హీరోగా ఎలాంటి సినిమా చేసినా సరే అల్లు అర్జున్ తన క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మైండ్ లో కేవలం తన క్యారెక్టర్ ఉండేలా మాత్రమే చేసుకుంటాడు. ఆర్య సినిమా లో అల్లు అర్జున్ కనపడడు కేవలం తను ప్రేమించే అమ్మాయి బాగుండాలని కోరుకునే ఆర్యనే కనపడతాడు.
బన్నీ సినిమాలో తన తండ్రి లక్షాన్ని నెరవేర్చే బన్నీనే కనపడతాడు. హ్యాపీ సినిమాలో తన భార్యకి ఏమైనా అయితే తట్టుకోలేని బన్నీనే కనపడతాడు. అలాగే దేశముదురులో సన్యాసం తీసుకున్న అమ్మాయిని ప్రేమించే బంటీ గోవిల్ గానే కనపడతాడు. ఇలా ఎన్నో సినిమాలు పరుగు, ఆర్య 2, వేదం, సన్ ఆఫ్ సత్యమూర్తి, బద్రినాథ్, జులాయి, రేసు గుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య, అల వైకుంఠపురములో, లేటెస్టుగా వచ్చిన పుష్ప ఇలా తన క్యారెక్టర్ మాత్రమే కనబడేలా నటించడం అల్లు అర్జున్ కే సాధ్యం. ముఖ్యంగా రుద్రమదేవి మూవీలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన తీరు హాలీవుడ్ రేంజ్ హీరోని సైతం తలదన్నే విధంగా ఉంటుంది. అలాగే అల వైకుంఠపురములో మూవీ చూసిన సినీ ప్రేక్షకులకు ఒక్క విషయం మాత్రం అర్ధమయ్యి ఉంటుంది. అసలు అల్లు అర్జున్ ఈ సినిమా లో నటించినట్టుగా లేదు మనకి తెలిసిన పక్కంటి కుర్రోడి కథ గురించి వింటున్నాం అన్నట్లుగా అనిపిస్తుంది.
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ తన పాత్రకి తగ్గట్టు నటించాలి. కానీ నటించినట్టుగా అనిపిస్తే మాత్రం సినిమా ఫెయిల్యూర్. కానీ అల్లు అర్జున్ బంటు అనే పాత్రలో శరీరంలో ఉన్న నాడి, నరం రెండిటిని సమపాళ్లలో ఉంచుకొని తెరపై విజృంభించాడు. 2020లో వచ్చిన అల వైకుంఠపురములో మూవీతో 300 కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసి సంచలనం సృష్టించాడు. ఇంక గత సంవత్సరం వచ్చిన పుష్ప మూవీతో అల్లు అర్జున్ సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. ఆ సెంటర్, ఈ సెంటరనేది లేదు ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్స్ లోనూ అల్లు అర్జున్ సునామిని సృష్టించాడు. ఆ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ అందుకున్న ఉత్తమ నటుడి అవార్డు అంటే భారతదేశంలోనే ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడానికి అల్లు అర్జున్ నూటికి నూరుశాతం అర్హుడు. పైగా తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు జాతీయ అవార్డుని గెలుచుకున్న హీరో లేడు.
ఇప్పుడు అల్లు అర్జునే ఆ అవార్డు ని అందుకొని తెలుగోడి నటనకున్న శక్తిని చాటి చెప్పాడు. ఆయన తన గత సినిమాలన్నింటిలో చేసిన నటనకు సంబంధించి అన్ని వేరియేషన్స్ ని అల్లు అర్జున్ ఈ ఒక్క పుష్ప మూవీ లోనే చేసి చూపించాడు. లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ లో అల్లు అర్జున్ విజృంభించాడు. అందుకే అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డుని గెలుచుకున్నాడు. ఏ ముహూర్తాన తగ్గేదేలే అనే డైలాగ్ ని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేత చెప్పించారో గాని అల్లు అర్జున్ 69 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాని జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని సాధించి తెలుగు హీరో తగ్గేదేలే అని నిరూపించాడు. అల్లు అర్జున్ కి మా సుమన్ టీవీ తరపున అభినందనలు.