మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ పరిశ్రమ లేదు. టాలీవుడ్ స్థాయిని దేశ విదేశాలకు తీసుకెళ్లిన నటుడు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అన్నయ్యగా గూడుకట్టుకున్న యాక్టర్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లకు ఆయనొక స్ఫూర్తి.
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ పరిశ్రమ లేదు. టాలీవుడ్ స్థాయిని దేశ విదేశాలకు తీసుకెళ్లిన నటుడు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అన్నయ్యగా గూడుకట్టుకున్న యాక్టర్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లకు ఆయనొక స్ఫూర్తి. 1978 నుండి ఇప్పటికీ నటనను కొనసాగిస్తున్న చిరు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన ఆయన.. ప్రస్తుతం భోలా శంకర్‌తో మన ముందుకు రాబోతున్నారు. ఈ నెల ఆగస్టు 11న నుండి థియేటర్లలో సందడి చేయబోతోంది. కాగా, వాల్తేరు వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సెలబ్రేషన్ చేసుకుంది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని లేపుతున్నాయి.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అని చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది. అప్పట్లో అది పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఈ ఈవెంట్ సందర్బంగా చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమోమో అనిపించకమానదు. ఇప్పటి వరకు ఆయన సినిమాకు సంబంధించిన ఏ వేదికపైనా కూడా రాజకీయ విమర్శలు కానీ ఆరోపణలు చేయలేదు. చాలా హుందాగా మాట్లాడుతూ.. ఆదర్శంగా నిలిచారు. కానీ వాల్తేరు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్లలో ఆయన ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా మీద, రోడ్ల నిర్మాణం, ప్రజలకు పనికి వచ్చే పథకాల గురించి, ఉపాధి గురించి మాట్లాడాలి కానీ.. పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమ మీద పడతారేంటీ అని వైసీపీ నుద్దేశించి ఆయన మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా జన సేన పార్టీ గురించి మాట్లాడలేదు చిరంజీవి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన చేసిన హితవు చూస్తుంటే.. జన సేన నేతలకు బూస్టప్‌గా తయారయ్యింది. వాళ్లలో ఫుల్ జోష్ వచ్చింది. జన సైనికులు ఆనంద ఢోలికల్లో మునిగి తేలుతున్నారు. రాబోయే రోజుల్లో జనసేనానికి అండగా ఉంటారని, తమకు మద్దతుగా నిలుస్తారని భరోసాతో ఉన్నారు జన సైనికులు. దీంతో ఆయన జనసేనలోకి వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ వంటి స్టార్ నటుడు..జనసేనకు మద్దుతుగా నిలిచి, రాజకీయ ప్రచారానికి వెళ్లినా.. ఓ పిలుపు ఇచ్చినా.. ఆ ప్రభావం కచ్చితంగా జిల్లాలపై పడుతుంది. ఈ మేనియాను వినియోగించుకుని ఎన్నికల్లో ముందుకు వెళితే గెలుపు తధ్యమన్న యోచనలో పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో తమ్ముడు పవన్ కళ్యాణ్.. పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్. పవర్ స్టార్ అంటే అభిమానం ఉంది కానీ.. వాటిని ఓట్లుగా రాబట్టుకోవడంలో విఫలమయ్యారు కళ్యాణ్. ఇప్పుడు అన్నయ్య లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా తోడైతే.. కచ్చితంగా గెలుపు పవనాలు .. పవన్ కళ్యాణ్ వైపు వీచే అవకాశాలున్నాయని రాజకీయ పండితుల ఆలోచన కూడా. ఈ లెక్క ప్రకారం చూస్తే అన్నయ్యను పవన్ పార్టీలోకి ఆహ్వానిస్తారా.. ఒక వేళ పిలిస్తే.. అన్నయ్య పార్టీలోకి వెళతారా, లేదా మద్దుతుగా నిలుస్తారా అని వేచి చూడాల్సిందే.
MEGA MASS BONDING ❤️🔥❤️🔥#200DaysOfWaltairVeerayya 🤩#WaltairVeerayya https://t.co/14aeSo2W9i pic.twitter.com/usZHxGLXCj
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 7, 2023