తమిళ సినిమాలను విపరీతంగా ఆదరిస్తుంటారు తెలుగు ఆడియన్స్. ముఖ్యంగా ప్రేమ కథల్ని. అటువంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది ‘7జి బృందావన్ కాలనీ’.ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
తమిళ సినిమాలను విపరీతంగా ఆదరిస్తుంటారు తెలుగు ఆడియన్స్. ముఖ్యంగా ప్రేమ కథల్ని. అటువంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది ‘7జి బృందావన్ కాలనీ’.ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సెల్వరాఘవన్ అలియాస్ శ్రీ రాఘవ ఈ సినిమాను మలిచాడు. తుళ్లువదో ఇలామై, సోదరుడు ధనుష్ నటించిన కాదల్ కొండేన్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత మూడవ చిత్రంగా వచ్చిందే ‘7జి రెయిన్ బో కాలనీ/ 7జి బృందావన్ కాలనీ’.బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం తనయుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2004లో విడుదల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఈ సినిమా సమయంలోనే సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్‌తో ప్రేమలో పడ్డారు. అనంతరం వివాహం చేసుకున్నప్పటికీ.. వీరి కాపురం మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. ఇక ఈ సినిమాతో అతడి క్రేజియెస్ట్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఈ సినిమాతోనే రవికృష్ణకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వేస్తుంటే.. మిస్ కాకుండా చూసే వాళ్లు ఉన్నారు. ఈ సినిమాలో రవికృష్ణ పాత్రను తమను చూసుకుంటూ ఉంటారు. అంతలా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు.. ముఖ్యంగా యువకులు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రకటించారు.
ఈ సినిమాతో మరోసారి రవికృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేయబోతున్నాడు. యువన్ శంకర్ రాజా, సెల్వరాఘవన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ అనశ్వర రాజన్‌ని కథానాయికగా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనశ్వర చైల్డ్ ఆర్టిస్టు నుండి సినిమాలు చేస్తుంది. తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఇటీవల వచ్చిన పద్మిని ఆమె నటనకు మంచి ఆదరణ లభించడంతో పాటు యారియన్2 అనే హిందీ సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు. ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళుతుంది. ఎఎం రత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.