ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతో ఆ బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. ఇక దంపతుల్లో ఒకరు లేకపోయినా.. దాంపత్య జీవితం బోసిపోయినట్లు ఉంటుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే తండ్రి లేకపోయినా.. తల్లి ఇంటిని లాక్కురాగలదు.
ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతో ఆ బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. ఇక దంపతుల్లో ఒకరు లేకపోయినా.. దాంపత్య జీవితం బోసిపోయినట్లు ఉంటుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే తండ్రి లేకపోయినా.. తల్లి ఇంటిని లాక్కురాగలదు. అదే తల్లి లేకపోతే.. తండ్రి బిడ్డలను పెంచి పెద్ద చేయడానికి కష్టపడుతుంటాడు. ఇక పిల్లలకు పెళ్లి చేయాలంటే.. తీవ్ర ఇబ్బందులకు గురౌతుంటాడు. ఇంట్లో ఇల్లాలు లేకపోతే.. పిల్లలను ఓ ఇంటివారిని చేయాలంటే తండ్రికి తల ప్రాణం తోకకు వస్తుంది. అయినప్పటికీ.. చుట్టాలు, బంధువుల సాయంతో పని కానించేస్తారు. కానీ తల్లి లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
అయితే ఓ భర్త మాత్రం భార్య లేని జీవితాన్ని జీర్ణించుకోలేక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో కుమారుడి పెళ్లి కూడా ఉండటంతో భార్య కూడా పెళ్లి ఇంట్లో కనిపించాలనుకున్నాడు. అందు కోసం ఆమె రూపంలో బొమ్మను తయారు చేయించి.. నెలకొల్పాడు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల డోన్ నెహ్రూనగర్‌కు చెందిన ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ మర్రి గోవిందరాజులు సతీమణి శ్రీదేవి ఈ ఏడాది మే ఒకటిన అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు భర్త. అదే సమయంలో కుమారుడికి వివాహం కూడా కుదరడంతో.. తల్లి లేదన్న ఆలోచన రాకూడదన్న ఉద్దేశంతో తమిళనాడులోని మధురైలో శిల్పకళాకారులతో విగ్రహాన్ని తయారు చేయించారు.
ప్రాణం ఉట్టిపడేలా ఆర్టిఫిషియల్ స్కిన్‌తో బొమ్మను తయారు చేశారు శిల్పులు. ఈ నెల 26న గోవిందరాజులు కుమారుడు సిద్దార్థ్ శ్రేయస్ వివాహానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో విగ్రహాన్ని వివాహ వేదిక వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఆ విగ్రహం ముందు వివాహం జరిపించనున్నారు. బుధవారం తన కుమారుడికి పెళ్లికొడుకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహాన్ని తయారు చేయించి, భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నారు ఆ భర్త.