హైదరాబాద్ చూట్టూ రీజినల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కు ఈ ప్రాజెక్ట్ రాకతో వ్యాపార వాణిజ్య రంగాల్లో మరింత అభివృద్ది సాధించనున్నది.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. అనేక చైనీస్ యాప్స్ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో 14 యాప్స్‌ని బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే..
దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయండంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సంగతి అందరికీ విదితమే. ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం ప్రక్రియ మొదలైపోగా, ఇప్పుడు ఓటర్ వివరాల వంతొచ్చింది. అందుకు సంబంధించినదే ఈ కథనం.
ICC World Cup 2023: ప్రపంచ క్రికెట్ లో రిచెస్ట్ బోర్డుగా చలామణి అవుతున్న భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి భారీ నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.955 కోట్ల మేర నష్టపోనుంది. కాకుంటే.. ఇది కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం కనుక పన్ను ఉపశమనం ఇవ్వకపోతే భారీ నష్టం తప్పదని బీసీసీఐ ఓ నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్(ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023) జరగనున్న సంగతి […]
గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం అప్పుల చుట్టే తిరిగింది. మరీ ముఖ్యంగా ఏపీలో జగన్ ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. ఇప్పటికైనా కళ్లు తెరకవపోతే.. ఏపీ పరిస్థితి మరో శ్రీలంకలా మారుతుందని.. జోరుగా ప్రచారం చేశాయి. అయితే విపక్షాల విమర్శలని వైసీపీ గట్టిగా కౌంటర్ చేయలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం రాష్ట్రాల అప్పులు వివరాలు వెల్లడించింది. […]
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కష్టాలు మొదలయ్యాయని.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనతో సామాన్యులు వంటింటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారని సిలిండర్లపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఎత్తి వేశారన్నారు. మోదీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. గ్యాస్ సిలిండర్‌ఫై రాయితే ఎత్తివేయడమే అధిక ధరకు కారణం అన్నారు. ఎక్కడో జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి.. ధరలు పెంచడం ఎక్కడైనా […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతేనని మరోమారు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్థారిస్తూ.. 2022-23 బడ్జెట్‌లో కొన్ని కేటాయింపులు కూడా చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే ప్రస్తుత బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయంతో పాటు.. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేశారు. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల […]
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఫోన్ లేకపోతే.. జీవితం ఆగిపోయినట్లే అని పరిస్థితికి చేరుకున్నాం. అయితే ప్రపంచంవ్యాప్తంగా ఏ స్మార్ట్ ఫోన్ పని చేయాలన్నా.. దానిలో ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) అత్యంత ముఖ్యమైన విభాగం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ లలో ఉన్న ఓఎస్ గూగుల్ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఓఎస్ మాత్రమే. త్వరలోనే వీటికి చెక్ పెట్టాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఈ రెండు ఓఎస్ […]
వాట్సాప్, టెలిగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్ ల వినియోగానికి సంబంధించి మోదీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమైన పత్రాలను పంపించడానికి గాను ఈ యాప్ లను వాడకూడదని స్పష్టం చేసింది. ఈ యాప్ ల ద్వారా డాక్యుమెంట్లను పంపిస్తే.. అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను హెచ్చరించింది. ఈ యాప్ ల సర్వర్లు విదేశాల్లో ఉన్నాయని.. వీటి ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని […]
ముంబయి- సంక్రాంతి పండగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంతోషకరమైన వార్త చెప్పింది. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆందోళన చెందుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కార్ ఉపశమనం కలిగించే కబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్ లో వంట నూనె ధరలు భారీగా తగ్గు ముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంట నూనెపై 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు […]