విజయవాడలోని టీవీఎస్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
విజయవాడలో కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ షోరూం చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఉంది. గురువారం తెల్లవారుజామున షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో షోరూంతో పాటు గోదాములో ఉన్న సుమారు 300 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. విజయవాడకే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు గోడౌన్ లో ఉంచుతారు. టూవీలర్లే కాకుండా సర్వీస్ సెంటర్లను కూడా ఇక్కడే నిర్వహిస్తుండడంతో సర్వీస్ కోసం ఇచ్చిన వాహనాలు కూడా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
షోరూం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఆ మంటలు గోడౌన్ కి వ్యాపించాయి. భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే అప్పటికే షోరూం బాగా కాలిపోయింది. ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించడం వల్ల షోరూంలో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మరోవైపు షోరూంలో పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ టూవీలర్లు కూడా ఉన్న కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అంటున్నారు. పెట్రోల్ వాహనాలను ఉంచే గోడౌన్ దగ్గర ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉంచడం.. వాటికి ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
Several two-wheelers were gutted, after a massive #fire that broke out in TVS showroom and godown, in KP Nagar area in #Vijayawada, fire fighters were doused the fire.
Both Petrol and Electric vehicles were gutted in #Flames #FireAccident #ElectricVehicles #AndhraPradesh pic.twitter.com/1qzrDSxjff
— Surya Reddy (@jsuryareddy) August 24, 2023
#AndhraPradesh: Fire broke out at the TVS showroom in the early hours of #Thursday morning in #Vijayawada. Hundreds of #vehicles, including #ElectricVehicles, reduced to ashes. The cause of #fire is suspected to be a short circuit.
📸: @prasantmadugula @NewIndianXpress pic.twitter.com/yng2ORZTzq
— TNIE Andhra Pradesh (@xpressandhra) August 24, 2023