తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో కీలక నేత గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నమ్మి తాను టీడీపీలో జాయిన్ అయ్యానని.. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం.. టీడీపీలో బీసీలకు స్థానం లేదు అంటూ గంజి చిరంజీవి సంచలన ఆరోపణులు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని.. కానీ టీడీపీలోని కొందరు నాయకులు తనను రాజకీయంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
టీడీపీ అంటే బీసీల పార్టీ అని చెప్పుకుంటారని.. కాని మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించిన నియోజకవర్గం అన్నారు. ఆ ఒక్క సీటును కూడా లోకేష్ కోసమే లాక్కున్నారని ఆరోపించారు. అందులో భాగంగా ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన తనను పక్కకు పెట్టారని ఆరోపించారు. ఒకవేళ పార్టీని తాను మోసం చేస్తే.. తాను నమ్ముకున్న దేవుడు తనను నాశనం చేస్తాడని.. అలా కాక.. టీడీపీనే తనను మోసం చేస్తే అదే దేవుడు ఆ పార్టీని నాశనం చేస్తాడని జోస్యం చెప్పుకొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆఖరి నిమిషం తనకే అని చెప్పి.. ఆఖర్లో దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో బీసీగా ఉన్న తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని.. 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ గంజి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సొంత పార్టీ వాళ్లే.. తన రాజకీయ జీవితం నాశనం చేశారని.. మంగళగిరి ఎమ్మెల్యే సీటు తనదే అని చెప్పి మోసం చేశారని గంజి శ్రీనవివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి.. మంగళగిరి ప్రజలకు దూరం చేశారన్నారు. చేనేత, బీసీగా ఉన్న తనను అణగదొక్కారని.. తన ఆవేదన బాధ నేతలకు తెలిసినా పట్టించుకోలేదన్నారు. ఎస్టీ, బీసీలకు న్యాయం చేసేవారితోనే నడుస్తానని.. అందరిని సంప్రదించి త్వరలో నిర్ణయం తీసుకుంటాను అని గంజి చిరంజీవి ప్రకటించారు.
గంజి చిరంజీవి టీడీపీ తరఫున మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. నారా లోకేష్ 2019లో మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడంతో గంజి చిరంజీవికి ఆఖరి నిమిషంలో సీటు దక్కలేదు.. అయినా అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. లోకేష్‌కు అనుచరుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలా సడెన్‌గా పార్టీకి రాజీనామా చేయడం.. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం తాజాగా కలకలం రేపతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.