2024 ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదట కుప్పం నుంచే ఈ సమావేశాలను ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జగన్ కుప్ప నియోజకవర్గం కీలక కార్యకర్తలతో సమావేశమయ్యారు. 175 సీట్లలో గెలవడం కుప్పం నియోజకవర్గం నుంచే మొదలుకావాలంటూ పిలుపునిచ్చారు. "చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే కుప్పం నియోజకవర్గాన్ని మనమే ఎక్కువగా అభివృద్ధి చేశాం. అక్కడి ప్రజల ఆశీర్వాదం మనకు ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఘన విజయం నమోదు చేయగలిగాం. మీకు నేను అండగా ఉంటాను. భరత్ ను మీరు గెలిపిస్తే ఆయనను మంత్రిని చేసే బాధ్యత నాది." అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగానే భావిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రెండురోజుల్లోగా రూ.65 కోట్లు నిధులు విడదల చేయనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు కూడా వెంటనే ప్రారంభించుకోవచ్చని హామీ ఇచ్చారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: గోరంట్ల మాధవ్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఇదీ చదవండి: రాజ్యసభ సభాపతిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం..!