గత కొన్ని రోజులుగా ఏపీలో కరెంట్ కోతలు ప్రజలను ఎంత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయో అందరికి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా.. అధికార వైసీపీ మాత్రం సాంకేతిక సమస్యల వల్లే.. విద్యుత్ సమస్య తలెత్తిందని చెబుతుంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర విపక్షాలే కాక.. పొరుగు రాష్ట్రాల నేతలు కూడా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించగా.. తాజాగా మరో తెలంగాణ మంత్రి ఏపీలో నెలకొన్న పరిస్థితిపై స్పందించారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, సరైన రోడ్లు లేవు.. మొత్తంగా నరకంలో ఉన్నట్లు ఉంది అన్నారు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయింది: సీఎం KCR
హైదరాబాద్‌లో క్రెడాయ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు కేటీఆర్. భారతదేశంలో 80 శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ.. దేశాన్ని నడిపిస్తున్న శక్తి మాత్రం నగరాలు, పట్టణాలే అని తెలిపారు. తెలంగాణలో బ్యాలెన్స్‌డ్స్ గ్రోత్ ఉందని వివరించారు. పల్లె, పట్టణాల్లో సమానమైన ప్రగతితో ఒక వినూత్నమైన విధానం తెలంగాణలో ఉందన్నారు. మౌలికసదుపాయాలపరంగా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని కొనియాడారు. ఇక పొరుగు రాష్ట్రంలో ఉండే కష్టాల గురించి తనకు మిత్రుల చెప్పిన విషయాన్ని క్రెడాయ్ సదస్సులో ప్రస్తావించారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: పెట్రోల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి KTR!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సంక్రాతికి హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్లిన నా మిత్రులు.. అక్కడ వారి రాష్ట్రంలో ఎదుర్కొన్న కష్టాల గురించి నాకు వివరించారు. ఆ రాష్ట్రంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమయ్యి.. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మొత్తానికి నరకంలో ఉన్నట్లుగా ఉందని తెలిపారు. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే వరకు ప్రశాంతంగా ఉండలేకపోయామన్నారు. వాళ్లకు అక్కడికెళ్లిన తర్వాతే తెలంగాణలో డెవలప్‌మెంట్ ఎలా ఉందో అర్థమయ్యింది. అంతేకాక బెంగళూరులోని కంపెనీ యజమానులు అక్కడి ట్రాఫిక్‌పై మండిపడుతున్నారని’’ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రశాంత రాష్ట్రం అన్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Live: Addressing the gathering at the 11th edition of @CredaiHyderabad Property Show https://t.co/L9yuJFxuLt
— KTR (@KTRTRS) April 29, 2022
ఇది కూడా చదవండి: KTR వ్యాఖ్యల పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!