adipurush: ‘‘ఆదిపురుష్’’ సినిమాపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో చిన్న పాటి వార్ నడుస్తోంది. ‘‘ఆదిపురుష్’’ బీజేపీ భావజాలాన్ని వ్యాప్తి చేసే సినిమా అన్న కేటీఆర్ మాటల్ని ప్రభాస్ అభిమానులు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేధికగా ఆయనపై ఫైర్ అవుతున్నారు. తమ హీరో రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తని, అలాంటి ఆయన్ని రాజకీయాల్లోకి లాగటం ఏంటని మండిపడుతున్నారు. తమ హీరో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయడని అంటున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. ఎప్పుడూ బీజేపీని తప్పు బట్టే కేటీఆర్‌కు.. తమ హీరో రాముడిగా చేస్తున్న సినిమా బీజేపీ సినిమాగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ హీరోను రాజకీయాల్లోకి లాగొద్దంటున్నారు. తమ హీరో సినిమాలకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోవటం చూస్తుంటే.. కేటీఆర్‌కు ప్రభాస్ అంటే వ్యక్తిగత పగ ఉన్నట్లుగా తోస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాముడి సినిమాను రాజకీయాలతో ఎలా ముడిపెడతారంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం కేటీఆర్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంర్వ్యూలో మాట్లాడుతూ.. ఆదిపురుష్‌తో పాటు మొత్తం 15 సినిమాలు బీజేపీ ఐడియాలజీని వ్యాప్తి చేసే సినిమాలని ఆయన అన్నారు. ప్రధానంగా ఆదిపురుష్‌ను ప్రస్తావించారు. ఆ సినిమా సరిగ్గా ఎన్నికల టైంలో విడుదల అవుతుందని.. ఓటర్లను బీజేపీ గురించి, రామరాజ్యం గురించి ఆలోచించేలా చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ఏ రాష్ట్రాల ఎన్నికల్లో అయితే గెలవాలనుకుంటోందో.. ఆ రాష్ట్రాలకు సంబంధించిన నటుల్ని ఆ సినిమాలో పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. యూరీ-ది సర్జికల్ స్ట్రైక్, ది కశ్మీర్ ఫైల్స్, సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరి కొన్ని సినిమాలు కూడా బీజేపీ ఐడియాలజీ సినిమాలని అన్నారు. వాటికి బీజేపీ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందని అన్నారు.
కాగా, రామాయణ ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న ‘‘ఆదిపురష్’’ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ‘‘సైఫ్ అలీఖాన్’’ రావణుడిగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 11, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, కేటీఆర్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@KTRTRS pic.twitter.com/1slJEwyJ5W
— Sandy Prabha™🏹 (@SandyPrabha7) April 25, 2022
A film on Ramayana shouldn’t be linked to politics. Now since one party have started, others will come n claim it.
eventually movie wont get harmed bcoz controversy sells big time in india. Its best promotional tool.But such immature comments can damage harmony. So plz Stay away— gaya3 (@Chippz_z) April 25, 2022
@omraut Sir , Look into this.
Is this Thing True…??
What’s going on…#Prabhas #Adipurush
Prabhas sir will never do that ..— Lionel Messi (@lionelmessi7731) April 25, 2022
ఇవి కూడా చదవండి : వరల్డ్ రికార్డు.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.