ప్రభాస్ అనే ఒక్క పేరు చాలు భారతీయ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడానికి. తెలుగు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో లెవెల్లోకి వెళ్లడం ఒక్క ప్రభాస్ కే అలా సాధ్యమైంది.
ప్రభాస్ అనే ఒక్క పేరు చాలు భారతీయ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడానికి. తెలుగు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో లెవెల్లోకి వెళ్లడం ఒక్క ప్రభాస్ కే అలా సాధ్యమైంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్స్ దగ్గర పండుగ వాతావరం నెలకొంటుంది. ప్రభాస్ అభిమానుల తో పాటు ప్రేక్షకుల హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోను లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఇప్పుడొక వార్త బయటకి వచ్చింది. ఆ వార్త విన్న ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ -k గా వాడుకలో ఉన్న కల్కి 2898 అండ్ సలార్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. రెండు సినిమాల షూటింగ్స్ ల్లోను ప్రభాస్ పాల్గొంటున్నాడు. రెండు సినిమాలు కూడా తన అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తాయనే గట్టి నమ్మకంతో ప్రభాస్ ఉన్నాడు.ఇక అసలు విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి అనే సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో జగమెరిగిన సత్యం. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమా సుదీర్ఘ కాలం చిత్రీకరణ జరుపుకుంది. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. ఆ సినిమాలో వచ్చే పోరాట విన్యాసాలకి సంబంధించి గాని గుర్రపు స్వారీలు కి సంబంధించి గాని షూట్ లో ప్రభాస్ మాములు గా కష్టపడలేదు.
ఆ సమయంలో కొన్ని నెలల పాటు యాక్షన్ సన్నివేశాలు చెయ్యవలసి రావటంతో ప్రభాస్ కి మోకాలు నొప్పి సమస్య వచ్చిందంట. అప్పుడు ఏర్పడిన మోకాలు నొప్పి సమస్య నేటికీ ప్రభాస్ ని వెంటాడుతుందంట. ఇక ఏ మాత్రం లేట్ చెయ్యకుండా మోకాలు నొప్పికి శాశ్వత పరిష్కారం కోసం ఫారిన్ లో ఆపరేషన్ చేయించుకోవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలని పూర్తి చేసి వీలైనంత త్వరగా మోకాలి నొప్పి ఆపరేషన్ కోసం ఫారన్ వెళ్ళడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు.