పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2998-డి. నిన్న మొన్నటి వరకు ప్రాజెక్ట్-కె గా ప్రాచుర్యంలో ఉన్న ఈ కల్కి మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో అశ్వనిదత్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2998-డి. నిన్న మొన్నటి వరకు ప్రాజెక్ట్-కె గా ప్రాచుర్యంలో ఉన్న ఈ కల్కి మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో అశ్వనిదత్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షనే పెద్ద సంచలనం. ఈ కల్కి మూవీ లో ప్రభాస్ సరసన బాలీ వుడ్ నటీమణి దీపికా పడుకునే హీరోయిన్ గా చేస్తుంది.భారతదేశం గర్వించదగిన నటులైన అబితాబచ్చన్ ,కమలహాసన్ లు కూడా ఈ కల్కి మూవీ లో చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ఈ మూవీ కి సంబంధించిన ప్రతి విషయం కూడా సెన్సెషనే. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఇంకో సెన్సషన్ న్యూస్ బయటకి వచ్చింది. ఒక అగ్ర హీరో ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్రని పోషిస్తునన్నాడనే వార్త సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఉపుతుంది .కానీ మేకర్స్ ఎక్కడా కూడా ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. ఒక వేళ ఆ ఆర్టిస్ట్ కనుక కల్కి మూవీ లో చేస్తుంటే ఇంక పాన్ఇండియా లెవెల్లో కల్కి మూవీ రికార్డ్స్ సృష్టించడం పక్కా…
ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి మూవీల షూటింగ్స్ ల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. సలార్ మూవీ సెప్టెంబర్ నెలలో విడుదలకి రెడీ అవుతుంది. ఆ తర్వాత కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే కల్కి మూవీ కి సంబంధించి చిన్నగ్లిమ్ప్స్ లాంటి దాన్ని రిలీజ్ చేస్తే రికార్డు స్థాయి లో యూజర్స్ ని సంపాదించింది. నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకం గా ఈ కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు . 2018 వ సంవత్సరం లో వచ్చిన మహానటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చాలా టైం గ్యాప్ తీసుకొని ఈ కల్కి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పుడు ఈ మూవీ లో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడనే వార్త సినీ బజార్లో చక్కర్లు కొడుతుంది . కల్కి మూవీలో ఒక ముఖ్యమైన క్యారక్టర్ ఉందని.. సుమారు 10 నిమిషాల నిడివి ఉండే ఆ క్యారెక్టర్ టోటల్ కల్కి సినిమా కథ నే మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఆ క్యారక్టర్ కే దుల్కర్ ని తీసుకోవడానికి మేకర్స్ చూస్తున్నారని చెప్తున్నారు. దుల్కర్ సల్మాన్ నేడు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు తెలుగు,తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి పాపులారిటీ ఉన్న నటుడు. దుల్కర్ సల్మాన్ కల్కి-2898 డి మూవీ లో నటిస్తే కనుక పాన్ ఇండియా రేంజ్ లో కల్కి సినిమా ఇంకో స్థాయికి వెళ్తుంది. దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీతారామం మూవీ లో నటించి సూపర్ డూపర్ హిట్ సాధించాడు.