ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాల సందడి నెలకొంటోంది. హీరోల పుట్టిన రోజులు,ఇతర వేడుకల సమయంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.
ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాల సందడి నెలకొంటోంది. హీరోల పుట్టిన రోజులు,ఇతర వేడుకల సమయంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. అప్పట్లో హిట్ అయిన సినిమాలే కాదూ.. ప్లాప్ మూవీలను కూడా మళ్లీ విడుదల చేసి డబ్బులు రాబట్టుకుంటున్నారు నిర్మాతలు. అలా చాలా మంది హీరోల సినిమాలు.. మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. కాసుల వర్షం కురిపించాయి. ఈ సినిమాలను చూసేందుకు అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో నిర్మాతలు సైతం హీరోల పాత సినిమాలు మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాను విడుదల చేశారు మేకర్స్.
ప్రభాస్, నయనతార జంటగా నటించిన సినిమా యోగి. అప్పట్లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాను శుక్రవారం రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కాకినాడ శ్రీ ప్రియ థియేటర్‌లో యోగి సినిమా ప్రదర్శిస్తుండగా.. ఫ్యాన్స్ అంతా సంబరాల్లో తేలుతూ స్క్రీన్ చింపడమే కాకుండా కుర్చీలు కూడా ధ్వంసం చేసారు. ఈ థియేటర్ ఈ మధ్య కాలంలోనే బాగు చేశారు. ఇంతలో ఇలా ధ్వంసం కావడంతో లక్షల్లో యాజమానాన్యికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ చర్య పట్ల థియేటర్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇకపై ఈ థియేటర్‌లో రీరిలీజ్ మూవీస్ ఆడబోవని స్పష్టం చేశారు.
ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం లక్షల్లో నష్టం
కాకినాడ శ్రీప్రియ థియేటర్లో నేడు ప్రభాస్ సినిమా యోగి రీరిలీజ్ సందర్బంగా ఫాన్స్ అంతా సంబరాల్లో తేలుతూ స్క్రీన్ చింపడమే కాకుండా కుర్చీలు కూడా ధ్వంసం చేసారు. ఈ థియేటర్ ఈ మధ్య కాలంలోనే రెనోవటే చేసారు. ఇంతలో ఇలా ధ్వంసం కావడంతో థియేటర్… pic.twitter.com/KR50r1fbIR
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2023