వరల్డ్‌ రికార్డు.. 160 భాషల్లో​ అవతార్‌-2 రిలీజ్‌!

Avatar

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్‌’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అప్పటి వరకు చూసిన గ్రాఫిక్‌ విజువల్స్‌ అన్ని ఈ సినిమా ముందు తీసికట్టుగా మారాయి. ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలో విహరించేలా చేసింది ఈ సినిమా. ఎన్నో అద్భుతాలు ఉన్న అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్‌ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: బేబీ బంప్ తో డ్యాన్స్ చేసిన హీరోయిన్ ప్రణీత..! వీడియో వైరల్..

డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 16న ఏకంగా 160 భాషల్లో అవతార్‌-2ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదే గనక నిజం అయితే.. సిని చరిత్రలో ఇదే ప్రపంచ రికార్డ్‌ కానుంది. అంతేకాక అవతార్‌ 2ని ఐమ్యాక్స్‌, త్రీడీ, పీఎల్‌ఎఫ్‌, హైరేస్‌ వర్షన్స్‌లో విడుదల చేయనున్నారట.

ఇది కూడా చదవండి: డీజీపీ ఆఫీస్‌ ముందు నటి ఆత్మహత్యాయత్నం..avatarఈ సినిమా గ్లింప్స్‌ను బుధవారం సినిమా కాన్‌లో ప్రీమియర్‌ చేయనున్నారు. అలాగే హాలీవుడ్‌ మూవీ డైరెక్టర్‌ స్ట్రేంజ్‌ మ్యాడ్‌నెస్‌ ఆఫ్‌ మల్టీవర్స్‌ థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 160 భాషల్లో విడుదల కాబోతున్న అవతార్‌ 2 సినిమా గురించి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

ఇది కూడా చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మాస్‌ మహారాజ్‌ రవితేజ కొడుకు!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.