లండన్, న్యూయార్క్ వంటి అభివృద్ది చెందిన నగరాల్లో అయినా కరెంట్ పోతుందేమో కానీ.. హైదరాబాద్‌లో మాత్రం పవర్ కట్ ఉండదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం హైదరాబాద్ అని.. శుక్రవారం అప్పా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మెట్రో సభలో కేసీఆర్ స్పష్టం చేశారు. అలానే హైదరాబాద్ మెట్రోను ఎయిర్ పోర్టు వరకూ విస్తరించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ వైశాల్యం కంటే పెద్దదని […]
పోలీసు వ్యవస్థలో వాహనాలకు సరైన పత్రాలు, హెల్మెంట్ లేక పోతే చలానాలు విధించే అధికారం ఉంది. అందులో భాగంగానే ఓ వ్యక్తికి హెల్మెంట్ ధరించలేదని రూ. 6వేలు జరిమానా వేశారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన షాక్ మాములుగా లేదు. ప్రస్తుతం సదరు వ్యక్తి చేసిన పని వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. మెహతాబ్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా […]
ఐపీఎల్ 2022లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మధ్యలో పవర్ కట్ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రపంచలోనే అతి పెద్ద, అత్యంత రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఇలా కరెంట్ లేక కీలకమైన డీఆర్‌ఎస్ నిలిపివేయడంతో లీగ్ పరువు దిగజారింది. ఆ కొన్ని నిమిషాలలోనే ఒక జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపడంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో క్రికెట్ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లీగ్‌లో ఇంత అలసత్వమా? […]
బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీగా పేరొందిన ‘ఐపీఎల్’ లో వింత అనుభవం ఎదురైంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు పవర్ కట్ సమస్యగా మారింది. పవర్ లేక 5 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఆట ఐపీఎల్ పరువు దిగజారేలా చేసింది. స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు.దీంతో తొలి రెండు ఓవర్లలో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకుండా […]
Power Cut: దేశంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. దాదాపు 8-9 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రాంతాల్లో దాదాపు 7-8 గంటల మేర కరెంట్ కోతలు మామూలైపోయాయి. ఎండాకాలంలో కరెంట్ కోతల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో సైతం అత్యవసర చికిత్సల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా, కరెంట్ కోత కారణంగా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో కరెంట్ పోవటంతో ఒకే సారి జరుగుతున్న రెండు పెళ్లిళ్లలో గందరగోళం నెలకొంది. […]
గత కొన్ని రోజులుగా ఏపీలో కరెంట్ కోతలు ప్రజలను ఎంత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయో అందరికి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా.. అధికార వైసీపీ మాత్రం సాంకేతిక సమస్యల వల్లే.. విద్యుత్ సమస్య తలెత్తిందని చెబుతుంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర విపక్షాలే కాక.. పొరుగు రాష్ట్రాల నేతలు కూడా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించగా.. తాజాగా మరో తెలంగాణ మంత్రి […]
మండే ఎండలే కాదు.. విద్యుత్ కోతలు కూడా దేశ ప్రజలను తీవ్ర ఇంబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక్క ఏపీలోనే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ పై ఆధారపడిన ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు కరెంట్ కోతలు విధించక తప్పడం లేదు. ఒకవైపు మండే వేసవి.. మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అసహనం, ఇబ్బందికి గురవుతున్నారు. చాలా మంది ఈ విద్యుత్ కోతలపై నోరు మెదపక పోయినా.. కొందరు మాత్రం బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.. ప్రభుత్వాల తీరును […]