పంది వేసిన చిత్రం ఖరీదు – లక్షల్లోనే!..

సోషల్​ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్‌ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్‌ అనే ఓ మహిళా స్థానికంగా ఫామ్‌ శాంక్చ్యూరీని నిర్వహిస్తోంది. లెఫ్సాన్‌కు 2016లో కబేళాలో ఓ వరాహం కనిపించింది. దీంతో ఆ వరాహాన్ని అక్కడి నుంచి రక్షించిన లెఫ్సాన్‌ తన శాంక్య్చూరీకి తీసుకెళ్లింది. కొన్నేళ్ల తర్వాత ఆ వరాహం లోని ప్రతిభను గుర్తించిన లెఫ్సాన్‌ దానితో చిత్రాలు వేయించడం ప్రారంభించింది. వరాహం కూడా నోటితో కుంచెను పట్టుకొని బొమ్మలు గీయం మొదలు పెట్టేసింది.

pigacasso


ఆ పంది గీస్తోన్న చిత్రాలను లెఫ్సాన్‌ నెట్టింట్లో పోస్ట్‌ చేయడం మొదలు పెట్టింది. ఆ పందికి “పిగాసో” అని పేరు పెట్టి.. ఆ పేరు మీదే సోషల్‌ మీడియా సైట్లలో అకౌంట్లను ఓపెన్‌ చేసింది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా పిగాసో గీసిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్‌గా మారాయి. ఇక పిగాసోకు కలర్స్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్స్ట్‌ కలగకుండా లెఫ్సాన్‌ సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం. ఇక పిగాసో గీసిన చిత్రాలు కేవలం వైరల్‌గా మారడానికే పరిమితం కాకుండా ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాలను వేలం పాట వేయడం ప్రారంభించారు. దీంతో పిగాసో ఇప్పటి వరకు గీసిన బొమ్మలను అమ్మడం ద్వారా ఏకంగా రూ.2,89,768 రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని జంతు సక్షేమ నిధికి ఉపయోగిస్తోంది లెఫ్సాన్‌. ఇప్పుడు పిగాసో సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది.