లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం.. అంటూ గుండమ్మకథ మూవీలో ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుంది కదా.. ఈ మద్య అమ్మాయిలు మగవాళ్లకు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఇస్తున్నారు.
ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి చిత్ర విచిత్రమైన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని భయం పుట్టించేలా.. ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో మన కళ్లముందు ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఔత్సాహికులు తమ టాలెంట్ చూపిస్తూ ఒక్కసారై స్టార్లుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. ఇంతకీ ఆ యువతి చేసిన పనేంటీ.. ఎందుకు ఇలా వైరల్ అవుతుందీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
కలియుగంలో కనీ వినీ ఎరుగని రీతిలో వింతలు, విచిత్రాలు జరుగుతాయని కాలజ్ఞానంలో బ్రహం గారు ఎప్పుడో చెప్పారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు చూస్తుంటే ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజమే అనిపిస్తుంది. ఊహలకందని వింతలు సోషల్ మీడియాలో ఎక్కడో అక్కడ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ యువతికి సంబంధించిన ఓ వింత ఘటన నెట్టింట వైరల్ గా మారింది.. ఇది చూసిన వారు ఇదేం విచిత్రం అంటూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా అబ్బాయిలు హెయిర్ కటింగ్, షేవింగ్ కోసం సెలూర్ కి వెళ్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఓ సెలూన్ షాపు కి యువతి వెళ్లి షేవింగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో నెట్టిం వైరల్ గా మారింది.
ఈ వీడియో ప్రకారం.. బార్బర్ యువతికి గడ్డం తీస్తున్నాడు. అబ్బాయిలకు ఎలా షేవింగ్ చేస్తారో అలాగే ఆ యువతికి షేవింగ్ చేశాడు. మొదట అమె ముఖానికి క్రీమ్ రాశాడు.. బ్రష్ తో రుద్దాడు.. మగవాళ్లకు వాడే బ్లేడ్ తో షేవింగ్ చేశాడు. ఆ యువతి కూడా ఎలాంటి భయం లేకుండా కూల్ గా షేవింగ్ చేయించుకుంది. అంతేకాదు ఈ వీడియో సోషల్ మీడియలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిని వారు ఒకొక్కరు, ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు అవును కాలజ్ఞానంలో బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు.. అది అక్షరాలా సత్యం అవుతుంది అంటూ కామెంట్స్ చేశారు. మరి కొంతమంది అబ్బాయిలకు అమ్మాయిలు అన్నింటా కాంపిటీషన్ వస్తున్నారు.. ఇది ఒక షాంపిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
बदलाव प्रकृति का नियम है। 😌😌 pic.twitter.com/HjAeu4kUOv
— Cyber Huntss (@Cyber_Huntss) August 3, 2023