ప్రేమ పేరుతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. బంధాలకు, రక్త సంబంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువతి తన బాబాయిని ప్రేమించింది. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఏ క్షణంలోనైనా ప్రేమ పుట్టొచ్చు. రెండు మనసుల మధ్య పుట్టిన ప్రేమ పెళ్లి బంధంతో ఒక్కటై ప్రేమికులు కాస్త భార్యాభర్తలుగా మారిపోతారు. ప్రేమకు పేద ధనిక అనే తారతమ్యాలు లేవు. కుల, మతాల అడ్డుగోడలు లేవు. ప్రేమను దక్కించుకోవడం కోసం నేరాలకు సైతం పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేమ పక్షులు ఎళ్లలుదాటి ఎగిరిపోతున్నారు. ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంత తపిస్తున్నారో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో యూపీలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ఆ యువతీ యువకులు చేసిన పనికి జనం నోరెళ్లబెట్టారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రేమకు ఏది అడ్డుకాదు, ఎవరు అడ్డుకోలేరు అన్నట్లుగా ఆ యువతీ యువకులు చేసిన పనే నిదర్శనం. ఉత్తర్ ప్రదేశ్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వావివరుసలు మరిచి కుటుంబసభ్యులు తలదించుకునేలా ప్రవర్తించారు వారిద్దరు. కూతురు వరుసైన అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఇది వినడానికి కఠోరంగా ఉన్నా వాస్తవంగా జరిగిన ఘటనే. వీరి బంధాన్ని కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించగా, చివరాఖరికి బంధువుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని తాజద్దీన్ పూర్ విలేజ్ లో శుభమ్ అనే యువకుడు తన సోదరుడి కూతురు రియాను ప్రేమించాడు. ఆ యువతి కూడా శుభమ్ ను ఇష్టపడ్డది. గత మూడేళ్ల నుంచి వీరి మధ్య ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు.
కలిసి బతకాలనుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పారు. ఇది విన్న కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. వరుసలు మరిచి ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లికి ఒప్పుకోమని తెగేసి చెప్పారు. స్థానిక ప్రజలు కూడా వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికి శుభమ్, రియాలు మనసు మార్చుకోలేదు. ఎవరెన్ని చెప్పిన ప్రాణాలైనా తీసుకుంటాము గాని మా ప్రేమను మాత్రం వదులుకోబోమని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఇక చేసేదేంలేక వారి పెళ్లికి అంగీకరించారు తల్లిదండ్రులు. దీంతో స్థానిక దేవాలయంలో సోదరుడి కూతురైన రియాను నుదిట తిలకం దిద్డి, దండలు మార్చుకుని వివాహమాడాడు శుభమ్. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.