ఈ మద్య మెట్రో ట్రైన్ లో ప్రయాణికులు రక రకాల విన్యాసాలు చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెట్రో ట్రైన్ లో ఇటీవల పలు చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందరూ చూస్తుండగానే డ్యాన్సులు చేయడం, రీల్స్ తీయడం, పాటలు పాడటం సర్వసాధారణం అయ్యాయి. కొంతమంది లవర్స్ మూద్దూ ముచ్చటలు కూడా మెట్రోలోనే కానిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని నిబంధనలకు ఇవి విరుద్ధమని అధికారులు చెబుతున్నా కొంతమంది ప్రయాణికులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ యువతి మెట్రోలో అందరూ చూస్తుండగానే పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల మెట్రోలో తోటి ప్రయాణికులను పట్టించుకోకుండా కొంతమంది తమ పెర్ఫార్మెన్స్ కాస్త గట్టిగానే ఇస్తున్నారు. చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేయడానికి మెట్రో ట్రైన్ ని బాగా వినియోగించుకుంటున్నారు. రైలు కోచ్‌లలో వీడియోలు షూట్ చేయడంపై నిషేధం అని మెట్రో కార్పొరేష్ అధికారులు పదే పదే చెబుతున్నా.. కొంతమంది ప్రయాణికులు మాత్రం వీడియోగ్రఫీలో మునిగి తేలుతున్నారు. ఓ యువతి బెంగుళూరు ట్రైన్ లో అందరూ చూస్తుండగా పల్టీ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో మిషా శర్మ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ యువతి సడెన్ గా ఫల్టీ కొట్టడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే షాక్ తిన్నారు. కొంతమంది ప్రయాణికులు ఆమె చేష్టలకు నవ్వుకున్నారు.
ఈ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ మెట్రో ట్రైన్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు.. వావ్ సూపర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీకు అంత టాలెంట్ ఉంటే.. ఒలంపిక్స్ లో చూపించండి.. ఇలా పబ్లిక్ లో కాదు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మెట్రో ట్రైన్ లో ఎలాంటి వీడియోలు చిత్రీకరించవొద్దని.. అలా చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకోబడతాయని మెట్రో కార్పొరేషన్లు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది యూట్యూబ్ లో లైకులు, షేర్ల కోసం ఇలాంటి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.