మెగాస్టార్ చిరంజీవి కుర్రా హీరోలతో పోటీ పడుతూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ నెల 11న భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా నటించారని మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు.
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వతా ఆ స్థాయి ప్రేక్షకాధరణ పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మెగాస్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. అభిమానులు ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుస్తుంటారు. ఎంతమంది హీరోలు వచ్చినా.. మెగాస్టార్ అంటే టాలీవుడ్ కి ఎవరెస్ట్ శిఖరం లాంటివారు అని అంటారు. ఎంతోమంది యువ హీరోలు ఆయను ఆదర్శంగా తీసుకుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి ఆ మద్య రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వివివినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెం.150 తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ సినిమా ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ జోష్ తో మొదలు పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మెగాస్టార్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా ఆయన మోకాలి నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. వీలైనంత త్వరగా ఆయన సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్దమైతున్నట్లు సమాచారం.
చిరంజీవి మోకాలి సర్జరీ హైదరాబాద్ లో కానీ ఢిల్లీ లేదా బెంగుళూర్ లో చేయించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వేరే చోట సర్జరీ అయితే ఆయన నెలరోజుల పాటు అందుబాటులో ఉండరని తెలుస్తుంది. సర్జరీ తర్వాత ఆయన ఒక నెలరోజుల పాలు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారని అంటున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మాలీవుడ్ హిట్ చిత్రం ‘బ్రో డాడీ’ రిమేక్ తెరకెక్కనుంది. మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ అని తెలియడంతో ప్రేక్షకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన తర్వగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
#update @KChiruTweets కి మోకాలు ఆపరేషన్ ఈవారం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది. ఢిల్లీ లేదా బంగళూరులో జరగొచ్చు. నెలన్నర పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఈ నెలా ఖరు వరకు హైదరాబాద్ లో అందుబాటులో వుండరు
— devipriya (@sairaaj44) August 14, 2023