దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్, ఓపెనర్ హసీమ్ ఆమ్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఆపై సుదీర్ఘ కాలం కౌంటీ క్రికెట్ ఆడిన ఆమ్లా, నేటితో క్రికెట్ తో తన అనుబంధాన్ని తెంచుకున్నాడు. కోచ్ గా, కామెంటేటర్ గా మరోసారి క్రికెట్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వచ్చేమో కానీ, బ్యాట్ పట్టకపోవచ్చేమో అని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో హసీమ్ […]
మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని సైతం ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించింది. ప్రిటోరియస్ ఆటకు గుడ్‌బై చెబుతూ..‘నా క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కొన్ని రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నాను. అన్ని రకాల ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాను. దేవుడిచ్చిన టాలెంట్, ఆట పట్ల నిబద్ధతే నన్ను ఇంతవరకు […]
వంద సెంచరీలు.. ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు.. ఎన్ని తరాలు గడిచినా.. ఇండియన్ క్రికెట్ గాడ్ అంటే సచిన్ టెండూల్కరే. క్రికెట్‌లో ఒక బ్యాటర్‌గా ఆయన సాధించిన ఘనతలు, చేసిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లు ఆయనను భారత క్రికెట్‌కు దేవుడిని చేశాయి. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కలగలిసిన క్రికెట్‌లో.. ఒక్క బ్యాటింగ్‌లోనే దిగ్గజంగా ఎదిగిన సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలిస్తే.. మరి ఆ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చి.. ఒక పరిపూర్ణ క్రికెటర్‌గా నిలిచిన […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఊహకందని సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరిపై ఎవరు గెలుస్తారో? ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా టోర్నీ సాగుతోంది. టోర్నీ మొదలైన తొలి రోజు నుంచి మొదలు.. గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగిసిన చివరి రోజు వరకు అదే జరిగింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లీగ్ స్టేజులోనే ఇంటి దారి పట్టగా, సెమీ ఫైనల్ రేసుకు పక్కా అనుకున్న దక్షిణాఫ్రికా ఊహించని రీతిలో ఇంటి ముఖం పట్టింది. ఇక […]
నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా 13 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో అనూహ్యంగా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ కు ఒరిగిందేమీ లేకపోయినా ప్రోటీస్ జట్టు మాత్రం సెమీస్ కోల్పోయింది. దీంతో సౌతాఫ్రికా జట్టుపై, ఆ జట్టు సారధిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ప్రపంచ కప్ అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయిన ప్రొటీస్ జట్టుకు ఈసారైనా ఆ కల వేరుతుందా! అనుకుంటుండగా నిర్లక్యం […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ ఊహకందని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్ దగ్గర నుంచి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. గ్రూప్ -1లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, గ్రూప్ స్టేజీకే పరిమితం కాగా, వార్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్న గ్రూప్ -2లో అంతకుమించిన హై డ్రామా నడిచింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో ఓడి సౌతాఫ్రికా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తొలి […]
క్రికెట్ ప్రపంచం మొత్తం ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్‌లో ఉంది. ఈసారి మాత్రం ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. అయితే సౌత్ ఆఫ్రికా- నెదర్లాండ్స్ మ్యాచ్ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సౌత్ ఆఫ్రికాపై నెదర్లాండ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఒక్క గెలుపు మాత్రమే కాదు.. సౌత్ ఆఫ్రికాకి ఉన్న సెమీస్ అవకాశాలను కూడా నెదర్లాండ్స్ జట్టు దెబ్బకొట్టింది. ఈసారి సెమీస్‌కు కూడా క్వాలిఫై కాకుండా […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టాప్ జట్ల కంటే చిన్న చిన్న జట్లే అద్భుతంగా రాణిస్తున్నాయి. వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది అని చెప్పేందుకు ఆదివారం సౌత్ ఆఫ్రికా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తమ ప్రతిభను చూపెడుతూనే ఉంది. ఓడినా, గెలిచినా ప్రత్యర్థికి టఫ్ ఫైడ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వరల్డ్ కప్‌లోనే ఓ అద్భుతమైన విజయాన్ని […]
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో పాకిస్తాన్ అద్భుత ప్రదర్శన కనపరిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, అనంతరం ప్రోటీస్ జట్టు 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో పాక్ సెమీస్ రేసులోకి రాగా, గ్రూప్-1 సెమీస్ […]
టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయా? సెమీస్ చేరడమేనా కష్టమేనా? అంటే అవుననే సమాధానం అనిపిస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై నెగ్గిన భారత జట్టు అలవోకగా సెమీస్ చేరుతుందని అందరూ అంచనా వేశారు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఓటమి పాలవడంపై సమీకరణాలు పూర్తిగా మారాయి. ప్రస్తుతానికి ఈ ఓటమి జట్టును బాధించకపోయినా సెమీస్ చేరాలంటే మాత్రం ఆడబోయే రెండు మ్యాచులలో మాత్రం తప్పక గెలవాల్సిందే. కాకుంటే ఈ మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించే […]